English | Telugu

ఇద్దర్ని మెయింటైన్‌ చేసే డాక్టర్‌బాబు అది చెయ్యలేడా?

బుల్లితెరపై విజయవంతంగా దూసుకువెళ్తున్న ధారావాహికల్లో ‘కార్తీక దీపం’ సీరియల్‌ ముందువరుసలో ఉంటుంది. అందులో డాక్టర్‌బాబు అలియాస్‌ కార్తీక్‌ పాత్రలో నటిస్తున్న నిరుపమ్‌ పరిటాల సైతం విజయవంతమైన బుల్లితెర నటుల్లో ఒకరు. ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తక్కువేం కాదు. బుల్లితెరపై ఆయనొక స్టార్‌. ఆయనతో పాటు తమ ఛానల్‌లో సీరియళ్లు చేస్తున్న స్టార్స్‌తో ‘స్టార్‌మా పరివార్‌ ఛాంపియన్‌షిప్‌’ పేరుతో ‘స్టార్‌మా’ ఛానల్‌ ఒక ఈవెంట్‌ చేస్తోంది. అందులోనూ నిరుపమ్‌ పరిటాల దూసుకువెళ్తున్నారు.

‘స్టార్‌మా పరివార్‌ ఛాంపియన్‌షిప్‌’ ఈవెంట్‌లో భాగంగా గేమ్స్‌ నిర్వహించారు. అందులో నిరుపమ్‌ విన్‌ అయ్యారు. ‘డాక్టర్‌బాబు... ఏంటి? మీ చేతిలో ఇంత మిరాకిల్‌?’ అని యాంకర్‌ శ్రీముఖి అడిగింది. ‘వంటలక్క’ అని పక్కనుంచి సమాధానం. ‘ఇద్దర్ని మెయింటైన్‌ చేస్తున్నాడు. అది చెయ్యలేడా’.. ప్రభాకర్‌ సెటైర్‌. దాంతో అందరూ ఒక్కసారి ఘొల్లున నవ్వారు. ‘శ్రీముఖి... ఇప్పుడు కూడా రెండేసి బ్యాలెన్స్‌ చేశారు’ – ఇంకో ఆర్టిస్ట్‌ పాయింటవుట్‌ చేశారు. ‘నీ కాళ్లకు ఓ దండం తల్లి’ అన్నట్టు నిరుపమ్‌ దణ్ణం పెట్టారు.

‘కార్తీక దీపం’ సీరియల్‌లో కథను అడ్డం పెట్టుకుని ‘స్టార్‌మా పరివార్‌ ఛాంపియన్‌షిప్‌’ ఈవెంట్‌లో నిరుపమ్‌ పరిటాల మీద ప్రతి ఒక్కరూ పంచ్‌ డైలాగ్స్‌ మీద పంచ్‌ డైలాగ్స్‌ వేస్తున్నారు. పాపం... ఎవర్నీ ఏమీ అనలేక, మౌనంగా భరిస్తున్నాడు డాక్టర్‌బాబు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.