English | Telugu

కంట‌త‌డి పెట్టించిన డాక్ట‌ర్ బాబు వైఫ్ స్టోరీ

బుల్లితెర‌పై కార్తీక దీపం సీరియ‌ల్ తో డాక్ట‌ర్ బాబుగా పాల‌పులారిటీని సొంతం చేసుకున్నారు న‌టుడు ప‌రిటాల నిరుప‌మ్‌. గ‌త కొన్నేళ్లుగా అప్ర‌తిహ‌తంగా సాగిన ఈ సీరియ‌ల్ తాజాగా కొత్త వెర్ష‌న్ మొద‌లైంది. ఈ సీరియ‌ల్ ని ఫేమ‌స్ చేసిన డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌ల‌కు ఇటీవ‌ల ఓ ఎపిసోడ్ లో యాక్సిడెంట్ తో ద‌ర్శ‌కుడు ఎండ్ కార్డ్ వేసేసి పిల్లలు పెద్ద‌వాళ్ల‌య్యారు.. ఇక మ‌రో కొత్త క‌థ షురూ అంటూ కొత్త క‌థ‌ని మొద‌లుపెట్టాడు. దీంతో నిరుప‌మ్ పాత్ర ఆ సీరియ‌ల్ లో ఎండ్ అయిపోయింది. మ‌ళ్లీ డాక్ట‌ర్ బాబు ఏ సీరియ‌ల్ తో నాబోతున్నాడు? .. అది ఎప్పుడు మొద‌ల‌వుతుంది? .. వంట‌ల‌క్క డాక్ట‌ర్ బాబు క‌లిసి చేస్తారా? అనే ఆస‌క్తి ప్ర‌స్తుతం బుల్లితెర ప్రేక్ష‌కుల్లో మొద‌లైంది.

అయితే ప‌రిటాల నిరుప‌మ్ అలియాస్ డాక్ట‌ర్ బాబు ఇంత వ‌ర‌కు ఏ సీరియ‌ల్ ని ప్ర‌క‌టించ‌లేదు. కానీ టీవీ షోల్లో మాత్రం వ‌రుస‌గా మెరుస్తున్నాడు. ఇటీవ‌ల స్టార్ మా వాళ్లు హోలీ ఫెస్టివెల్ సంద‌ర్భంగా ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తే అందులో డాక్ట‌ర్ బాబు, మోనిత రొమాంటిక్ సాంగ్ ల‌తో ర‌చ్చ ర‌చ్చ చేశారు. తాజాగా ఈటీవీ వారు ఉగాది సంద‌ర్భంగా `అంగ‌రంగ వైభ‌వంగా` పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ షో లో డాక్ట‌ర్ బాబు త‌న భార్య మంజుల తో క‌లిసి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా మంజుల నిరుప‌మ్ చెప్పిన స్టోరీ కంట‌త‌డి పెట్టిస్తోంది. సుమ‌, ప్ర‌దీప్ యాంక‌ర్ లుగా వ్య‌వ‌హ‌రించిన ఈ షోలో చేదు జ్ఞాప‌కం గురించి చెప్ప‌మ‌ని అడిగితే ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీని చెప్పుకొచ్చింది ప‌రిటాల మంజుల‌. ఆరేళ్ల క్రితం వైర‌ల్ ఆర్ద్ర‌రైటీస్ వ‌చ్చింద‌ని, బెడ్ మీద నుంచి లేవ‌లేని ప‌రిస్థితి.. న‌డవ‌లేని పరిస్థితి.. చాలా బాధ‌ప‌డ్డాను. న‌ర‌కం చూశాను. అస‌లు నేను బ‌దుకుతానా? లేదా అనే డౌట్ ఇచ్చింది` అని ఎమోష‌న‌ల్ అయింది మంజుల‌. మంజుల స్టోరీ వింటూ ఈ షోలో పాల్గొన్న వారంతా భావోద్వేగానికి లోన‌య్యారు. ఉగాది రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.