English | Telugu

రాజువయ్యా..మహరాజువయ్యా..

కొంతమందికి తీసుకునే అలవాటు ఉంటే ఇంకొంతమందికి ఇచ్చే అలవాటు ఉంటుంది. రెండో కోవలోకి వస్తారు మన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల అతని కొడుకు రికీ. ఈసారి ఒక స్వచ్చంద కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా నిర్వహించి మళ్ళీ తన అభిమానుల మనసులను దోచుకున్నాడు. హైదరాబాద్ లోని చెంగిచెర్లలో ఉన్న 70 మంది నిరుపేద పిల్లలకు పీజ్జాలు, పుస్తకాలను పంపిణీ చేసాడు. ఆ తర్వాత కాసేపు ఆ ఇద్దరూ కలిసి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ స్కూల్లో చదువు ఎలా చెప్తున్నారు, ఎలా చదువుకుంటున్నారనే విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుపమ్, రిక్కీ ఇద్దరూ కలిసి వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేశారు. ఇక అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా కార్తీకదీపం గురుంచి ప్రత్యేకంగా ముచ్చట్లు చెప్పారు.

ఇప్పటికీ ఇంకా ఆ సీరియల్ ని ఫాలో అవుతున్నామన్నారు. కార్తీక దీపం సీరియల్ లో మీరిద్దరూ చాలా బాగా నటించారు . ఈసారి మాత్రం తప్పనిసరిగా వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాధ్ ని కూడా తీసుకురావాలి అని మరీ మరీ చెప్పారు. కార్తీక దీపం సీరియల్ నుంచి బయటకి వచ్చేశాక డాక్టర్ బాబు, వంటలక్క ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటినుంచే ఇవ్వడం అనేది అలవాటు చేస్తే వాళ్లకు కూడా తెలుస్తుంది తనకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి అలాంటి సౌకర్యాలు లేక బయట ఎంతమంది బాధ పడుతున్నారు అనే విషయాలు . అందుకే రిక్కీకి ఇవన్నీ తెలియాలనే తీసుకెళ్ళాను అన్నాడు డాక్టర్ బాబు. ఇక కార్తీక దీపం బుల్లి తెర మీద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. నిరుపమ్ ఇప్పటికే ఎన్నో షోస్ లో కనిపించాడు. చాలా సీరియల్స్ లో నటించాడు. ఈయన భార్య మంజుల కూడా బుల్లితెర నటే. ఇప్పుడు ఈ కార్తీకదీపం సీరియల్ లో కొత్త క్యారెక్టర్స్ గా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ, మానస్ నాగులపల్లి, మనోజ్ కుమార్, సుష్మా కిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక నిరుపమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి ఎవరితో అనే విషయాలు ఇప్పటివరకు ఇంకా రెవీల్ చేయలేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.