English | Telugu

ఓటీటీ సినిమాకు రివ్యూ ఇచ్చిన‌ నిహారిక, చైతన్య!

యూట్యూబ్ ఫిల్మ్స్‌తో పాపుల‌ర్ అయిన సందీప్ రాజ్‌, `క‌ల‌ర్ ఫొటో` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఇంట్ర‌డ్యూస్ అయ్యాడు. తొలి సినిమాతో త‌న‌లో సత్తాను బ‌య‌ట‌పెట్టాడు. అయితే, ఆ సినిమా థియేటర్లలో విడుదల కావడంతో కొంచెం నిరాశ చెందినా... హిట్ టాక్ రావడంతో ఫైనల్లీ హ్యాపీగా ఫీలయ్యాడు. ఇప్పుడు సందీప్ రాజ్ నెక్స్ట్ సినిమా 'హెడ్స్ అండ్ టేల్స్' కూడా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు సందీప్ దర్శకుడు కాదు. కేవలం కథను మాత్రమే అందించాడు.

'కలర్ ఫొటో'కి పని చేసిన చాలామంది 'హెడ్స్ అండ్ టేల్స్'కి పని చేశారు. అందువల్ల, 'జీ 5'లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఈ నెల 22న (శుక్రవారం) సినిమా రిలీజ్ కానుంది. అయితే, ఆడియన్స్ కంటే కొంచెం ముందుగా మెగా డాటర్ నిహారికా కొణిదెల, '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య 'హెడ్స్ అండ్ టేల్స్' చూశారు. ఇద్దరూ సోషల్ మీడియాలో మంచి రివ్యూలు ఇచ్చారు.

"యూనిక్ స్టోరీ, సూపర్బ్ పెర్ఫార్మన్స్, సున్నితమైన హాస్యం. కొత్తగా... ఆసక్తికరంగా ఉన్నవి చూడాలని ఆశించే ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్" అని 'హెడ్స్ అండ్ టేల్స్' టీమ్ అందరినీ నిహారికా కొణిదెల ప్రశంసించారు. ఈ సినిమా అందంగా, కొత్తగా, సింపుల్ గా ఉందని '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య చెప్పాడు. ముఖ్యంగా సందీప్ రాజ్ డైలాగుల గురించి ప్రస్తావించాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.