English | Telugu

బ్లాక్‌బ‌స్ట‌ర్ సిరీస్‌ 'నార్కోస్: మెక్సికో' సీజ‌న్ 3 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

వ‌ర‌ల్డ్ వైడ్‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన 'నార్కోస్' వెబ్ సిరీస్ కొత్త సిరీస్ అతి త్వ‌ర‌లో మ‌న‌ముందుకు రాబోతోంది. నవంబ‌ర్ 5న 'నార్కోస్‌: మెక్సికో' సీజ‌న్ 3 ప్రీమియ‌ర్ కానున్న‌ది. 'నార్కోస్‌: మెక్సికో' సీజ‌న్ 3 ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను షేర్ చేసిన నెట్‌ఫ్లిక్స్, దాని రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసింది. ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజిన‌ల్ సిరీస్ కూడా మునుప‌టి సీజ‌న్‌ల త‌ర‌హాలోనే పెద్ద హిట్ అవుతుంద‌ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు. 'నార్కోస్: మెక్సికో' న్యూ సీజ‌న్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా అత్యంత ఆత్రుత‌తో ఎదురు చూస్తున్నాను.

ఈ సిరీస్ రెండో సీజ‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో 2020 అక్టోబ‌ర్‌లో రిలీజ‌య్యింది. అది బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డంతో, అప్ప‌ట్నుంచీ కూడా మూడో సీజ‌న్ ఎప్పుడొస్తుందా అని వీక్ష‌కులు వెయిట్ చేస్తూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు 2021 న‌వంబ‌ర్ 5న మూడో సీజ‌న్‌ను ప్రీమియ‌ర్ చేస్తున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించ‌డంతో వారు త‌మ ఆనందాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ కొత్త సీజ‌న్ 10 ఎపిసోడ్లు ఉండ‌నుంది.

1990ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో డ్ర‌గ్ బిజినెస్ వార్ మెయిన్ పాయింట్‌గా రూపొందిన‌ 'నార్కోస్: మెక్సికో' సీజ‌న్ 3లో స్కూట్ మెక్‌నైరీ, జోస్ మ‌రియా యాజ్‌పిక్‌, లూయిస్ గెరార్డో మెండెజ్‌, ఆల్బ‌ర్టో గుయెర్రా, లూసా రుబినో, అల్ఫాన్సో డోస‌ల్‌, మేరా హెర్మోసిల్లో, మాట్ లెషెర్‌, మాన్యుయెల్ మ‌సాల్వా, అలెజాండ్రో ఎడ్డా, గోర్కా ల‌సోసా న‌టించారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.