English | Telugu

నాగ్.. విన్న‌ర్‌గా అత‌న్నే చూడాల‌నుకుంటున్నారా?

కింగ్ నాగార్జున బిగ్‌బాస్ సీజ‌న్ 5కి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని సీజ‌న్ ల కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగ్ తాజా సీజన్ విష‌యంలో మాత్రం విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నారు. గ‌తంలో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నేచుర‌ల్ స్టార్ నాని విమ‌ర్శ‌ల‌కు గురి కావ‌డం తెలిసిందే కానీ నాగార్జున మాత్రం ఇంత వ‌ర‌కు హోస్ట్ ప‌రంగా విమ‌ర్శ‌ల‌కు గురి కాలేదు. అందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు కానీ తాజా సీజ‌న్ ప‌రంగా మాత్రం ఆయ‌న విమ‌ర్శ కుల‌కు అడ్డంగా దొరికి పోతుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

సిరి - ష‌న్నుల హ‌గ్గుల యుద్ధం అన్ స్టాప‌బుల్‌

సీజ‌న్ ప్రారంభం నుంచి ఓ ఇద్ద‌రు కంటెస్టెంట్‌ల‌పైనే ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డం మిగ‌తా వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డం తాజా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ష‌న్ను, సిరిల‌ని హ‌గ్గుల విష‌యంలో ఎంక‌రేజ్ చేయ‌డం.. స‌న్నీని గిల్టీ బోర్డ్ వేసుకోమ‌ని చెప్ప‌డం.. ష‌న్ను , సిరి త‌ప్పులు చేస్తున్నా వారిని మంద‌లించ‌క‌పోగా స‌న్నీని టార్గెట్ చేయడం వంటి కార‌ణాలు ఆడియ‌న్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. శ‌నివారం జ‌రిగిన ఎవ‌రు హిట్ ఎవ‌రు ఫ్లాప్ టాస్క్ లోనూ నాగ్ ప‌క్ష పాతాన్ని ప్ర‌ద‌ర్శించిన తీరు విమ‌ర్శ‌లు కురిపిస్తోంది.

ఈ టాస్క్‌లో ష‌న్ను ఫ్లాప్ అని కాజ‌ల్‌, ఆ త‌రువాత స‌న్నీ ట్యాగ్స్ పెట్టారు. ఆ త‌రువాత ష‌న్ను హిట్ అని సిరి ట్యాగ్ ఇచ్చింది. అయితే ష‌న్నుకి రెండు ఫ్లాప్ ట్యాగ్ లు రావ‌డం... స‌న్నీకి మూడు హిట్ ట్యాగ్‌లు రావ‌డం.. ఇష్టం లేని నాగార్జున ... ఏ ప్రాతిపాదిక పై ష‌న్నుని ఫ్లాప్ అంటావ‌ని స‌న్నీని నిల‌దీయ‌డం.. ఫైన‌ల్ గా స‌న్నీతోనే ష‌న్ను కి పెట్టిన ఫ్లాప్ ట్యాగ్ ని తీసేయించి దాన్ని సిరికి పెట్టించ‌డం ప‌లువురిని ఆశ్చర్యానికి అస‌హ‌నానికి గురిచేసింది. ప్రేమ వుంటే కంటెస్టెంట్ కి ఇంత‌లా స‌పోర్ట్ చేయాలా? .. త‌ప్పు చేస్తున్నా.. ఇలా వెన‌కేసుకురావాలా? .. హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాగార్జున ఇలా ప‌క్ష‌పాతాన్ని చూపించ‌డం ఏమీ బ‌గాలేద‌ని నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.. ఏంటీ నాగార్జున .. ఫ‌న్నుని విన్న‌ర్‌గా చూడాలనుకుంటున్నారా? అని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.