English | Telugu

అభయ్ కి రెడ్ కార్డ్ చూపించిన నాగార్జున.. హౌస్ నుండి వెళ్ళిపోతాడా!

బిగ్ బాస్ సీజన్ 8 శనివారం నాటి ప్రోమో రానే వచ్చింది. ఇక హౌస్ లో ఎవరెవరు ఏంటని చెప్తూ నాగార్జున క్లాస్ పీకుతాడని అందరు ఎదురుచూస్తుంటారు. ఇక నాగార్జున రావడం రావడమే ఓ కర్రతో వచ్చేశాడు.

ఫుల్ ఫైర్ తో నాగార్జున స్టేజ్ మీదకి వచ్చేశాడు. ఇక హౌస్ లో అభయ్ నిల్చొని ఉండగా.. బిగ్ బాస్ గురించి అభయ్ మాట్లాడిన మాటలన్నీ స్టేజ్ మీద ప్లే చేశారు నాగార్జున. ఇక అభయ్ తో పాటు హౌస్ మేట్స్ కి నోట మాట రాలేదు. " నీ ఫేసే.. నీ మాటలే.. అన్నీ లఫంగీ మాటలే.. అభయ్ దిజ్ ఈజ్ బిగ్ బాస్ హౌస్ .. బిగ్ బాస్ విల్ రూల్ " అంటు నాగార్జున చెప్పాడు. ఇక అభయ్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ సర్.. సారీ బిగ్ బాస్ అంటు చెప్పాడు. బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే‌.. నేను చూస్తూ ఊరుకోలేను.. బిగ్ బాస్ ఓపెన్ ది డోర్స్.. అభయ్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్.. మై డెసిషన్ ఈజ్ ఫైనల్ " అంటూ నాగార్జున కోపంతో చెప్పాడు. ఇక అభయ్ కి సపోర్ట్ గా యష్మీ నిల్చుంది. ప్లీజ్ సర్ ఒక్క ఛాన్స్ అంటు యష్మీ అడిగింది. ప్లీజ్ సర్ ఒక్కటే ఒక్క ఛాన్స్ అంటు అభయ్ రిక్వెస్ట్ చేయగా.. హౌస్ నుండి వెళ్ళిపోమన్నాడు నాగార్జున.

ఇక అభయ్ కి నాగార్జున ఇచ్చిన వార్నింగ్ తో హౌస్ మేట్స్ అంతా సెటిల్ అయినట్టు తెలుస్తోంది. ఇక అభయ్ హౌస్ లో ఉంటాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అయితే టాస్క్ లో పృథ్వీ ఆట చూసిన బిబి అభిమానులు.. అసలు రెడ్ కార్డ్ పృథ్వీకి ఇవ్వాలంటూ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు. ఇక హౌస్ లో‌ ఒక్కో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.