English | Telugu

తెలంగాణా పాలిటిక్స్ లోకి గంగవ్వ ఎంట్రీ ..


బుల్లితెర మీద సోషల్ మీడియాలో గంగవ్వ గురించి అందరికీ తెలుసు. అలాంటి గంగవ్వ రీసెంట్ గా ఒక ఛానెల్ వారు నిర్వహిస్తున్న ఒక టాక్ షోకి వచ్చింది. అందులో ఎన్నో విషయాలు చెప్పింది..అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడింది. "గంగవ్వా ఏంటి నువ్వు మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్తున్నావంట" అని హోస్ట్ అడిగేసరికి "నేను ఇక్కడి వెళ్ళేది రెండోసారైనా నువ్వు నా కన్నతల్లివి అన్నారు" అని గంగవ్వ అంది. "ఒహ్హ్ నువ్వు బిగ్ బాస్ కి కన్నతల్లివా" అంటూ హోస్ట్ క్లారిటీగా చెప్పేసరికి గంగవ్వ నవ్వేసింది. "బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు మీ హెల్త్ కి ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది" అని అడిగింది. "మనం బయట ఉప్పు కారం తగ్గట్టు తింటాం. వేడివేడి అన్నం తింటాం" అని చెప్పింది గంగవ్వ. "అమ్మా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏదో వండి పెట్టారంటే ఏంటది" అని అడిగింది. "మా ఊరు దగ్గర పూడూరు ఉంది.

అక్కడికి ఆయన వచ్చారు. అప్పుడు నేను బజ్జి మిర్చి చేసి తీసుకెళ్లి పెట్టాను. తిన్నారు." అని చెప్పింది. "అమ్మా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి పదవి ఇస్తానంటే మీరు చేస్తారా" అని అడిగింది. "తప్పకుండా చేస్తాను. నా మైండ్ లో కూడా అలాంటి ఆలోచనే ఉంది. చేయడానికి రెడీ నేను" అంటూ మంచి జోష్ తో సమాధానం ఇచ్చింది. గంగవ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. ఐతే బిగ్ బాస్ మధ్యలోంచి వచ్చేసినా కూడా ఆమె కలను బిగ్ బాస్ నిర్వాహకులు తీర్చారు. గంగవ్వ సొంతూరులో ఒక ఇంటిని నిర్మించి ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా గంగవ్వ కంటెస్టెంట్ గా వచ్చింది. ఇక ఇప్పుడు పాలిటిక్స్ లోకి కూడా గంగవ్వ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విషయం ఈ షో ద్వారా బయట పెట్టింది. మరి తెలంగాణ సీఎం గంగవ్వ మాటలు విని ఆమెకు ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా ? ఇస్తే ఏ పదవి ఇవ్వబోతున్నారో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.