English | Telugu

ముక్కు అవినాశ్ ఇంట పెళ్లి బాజాలు.. హ‌ల్దీ వేడుక‌లో జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌!

ముక్కు అవినాశ్‌ పెళ్లి పీట‌లు ఎక్కుతున్నాడు. 'జ‌బ‌ర్ద‌స్త్' షోలో త‌న కామెడీతో అంద‌ర్నీ న‌వ్వించి, ఆ త‌ర్వాత బిగ్ బాస్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి వీక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచిన అవినాశ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆగ‌స్ట్ 31న అనూజ వాకిటి అనే అమ్మాయితో నిశ్చితార్ధం జ‌రుపుకున్న అత‌ను ఆమెను ఓ టీవీ షో ద్వారా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం కూడా చేశాడు.

అప్పుడు, "అనూజ‌, అవినాష్‌కి ఎంగేజ్‌మెంట్ జరిగింది. కరెక్ట్ పర్సన్ మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆలస్యం చేయకూడదు. మా కుటుంబాలు కలిశాయి, మేము కలిశాము. చాలా నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగిపోయింది. మీరు ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు.. 'పెళ్లి ఎప్పుడూ?' అని, అతి త్వరలో నా అనూజతో.. ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు ఉంటాయని, మీ అవినాష్.. సారీ, అనూజా అవినాష్''.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.



కాగా, పెళ్లి వేడుక‌కు ముందు త‌న ఇంట్లో జ‌రిగిన ప‌సుపు కుంకుమ వేడుక‌కు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అవినాశ్ షేర్ చేశాడు.

ఆ ఫొటోల్లో అవినాశ్‌, అత‌ని త‌మ్ముడు అజ‌య్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌సుపు బ‌ట్ట‌లు ధ‌రించి సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. ప‌సుపు నీటిలో త‌డిసిన అవినాశ్ క‌ళ్ల‌కు బ్లూ గాగుల్స్ పెట్టుకొని ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నాడు. అత‌డి ముఖంలో పెళ్లి క‌ళ ఉట్టిప‌డుతోంది. పెళ్లి ముహూర్తం ఎప్పుడ‌నేది అవినాశ్ వెల్ల‌డించ‌లేదు. వెడ్డింగ్ కార్డును షేర్ చేయ‌లేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.