English | Telugu
పగిలిన మాళవిక బోనం.. గాజుపెంకుతో వేద కాలికి గాయం!
Updated : Jul 28, 2022
స్టార్ మాలో కొంత కాలంగా ప్రసారమవుతూ మహిళా వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోన్న సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటిస్తున్నారు. ఇతర పాత్రలను బెంగళూరు పద్మ, మిన్ను నైనిక, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సులోచన, వరదరాజులు తదితరులు పోషిస్తున్నారు. స్టార్ ప్లస్ లో ఏడేళ్ల క్రితం ప్రసారం అయిన ఓ హిందీ సీరియల్ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు.
సమస్యల నుంచి బయటపడితే అమ్మవారికి బోనం సమర్పిస్తానని వేద మొక్కుకుంటే, సులోచన, ఖుషీ క్షేమంగా ఇంటికి తిరిగొస్తే బోనం ఎత్తుతానని మాలిని మొక్కుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇరు కుటుంబాల వారు అమ్మవారి గుడికి వెళతారు. అక్కడికి బోనంతో మాళవిక ఎంట్రీ ఇస్తుంది. ఖుషీకి కన్నతల్లిని నేనే అని, నా బోనమే ముందు సమర్పిస్తానని వాదనకు దిగుతుంది. దీంతో యష్ తల్లి మాలిని గట్టి క్లాస్ పీకుతుంది. "నా కొడుక్కి భార్యవి కాదు.. మా ఇంటికి కోడలివి కాదు, కానీ ఖుషీకి తల్లివి ఎలా అయిపోతావే" అని నిలదీస్తుంది. అయినా సరే వినని మాళవిక అక్కడున్న సోదమ్మ దగ్గరికి వెళ్లి వేద కన్నతల్లి కాదని, డూప్లీకేట్ తల్లి అని అంటుంది.
అందుకు సోదమ్మ ఎవరు కన్నతల్లో ఎవరు కాదో.. ఎవరిది పాశమో.. ఎవరిది ప్రేమ బంధమో అమ్మే తేలుస్తుందని, ఎవరి బోనం తల్లికి ముందు సమర్పిస్తే వారే కన్నతల్లి అని చెబుతుంది. అమ్మవారికి బోనం సమర్పించడానికి గుడి మెట్లు ఎక్కుతుండగా వేద కాలికి గాజు పెంకు గుచ్చుకుని రక్తం కారుతూ వుంటుంది. అయినా సరే బోనం దించకుండా వేద ముందుకు సాగుతూ వుంటుంది. ఇక మాలిని మెట్లెక్కుతూ పడిపోవడంతో బోనం జారి పడి పగిలిపోతుంది. దీంతో మాలిని అక్కడే కూర్చుని ఏడుస్తూ వుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? వేద బోనం సమర్పించిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.