English | Telugu

'జబర్దస్త్‌'లో మెరిసిన‌ 'వకీల్ సాబ్' సూప‌ర్ వుమ‌న్‌!

'సూపర్ ఉమన్... సూపర్ సూపర్ సూపర్ ఉమన్' - 'వకీల్ సాబ్' సినిమాలో కోర్టు రూమ్‌లో పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది. అంతే కాదు, ఆ సీన్‌లో నటించిన లిరీషాకు ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడామెను 'జబర్దస్త్' స్టేజి మీదకు తీసుకొచ్చాడు రాకెట్ రాఘవ. జూలై 22న టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో సూపర్ ఉమన్ సందడి చేయనున్నారు.

'నేను సూపర్ ఉమన్ రా. ఎక్కడికైనా సరే పదిహేను నిమిషాల్లో వెళ్లిపోతా తెలుసా' అని సూపర్ ఉమన్ అలియాస్ లిరీషా చెప్పిన డైలాగ్ తో లేటెస్ట్ 'జబర్దస్త్' ప్రోమో కట్ చేశారు. 'ఆల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మొయినాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్‌కి సిర్ఫ్ పంద్రామినిట్ లో వచ్చిండ్రమ్మా మీరు' అని పవన్ అడగటం, 'సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్‌లో వచ్చేసినా' అని లిరీషా చెప్పడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. దానిని మరోసారి గుర్తు చేశారు.

రాకెట్ రాఘవ ఎపిసోడ్‌లో కూడా లిరీషా పోలీస్ గా కనిపించనున్నారు. ప్రోమో చూస్తుంటే టీమ్ కంటెస్టెంట్ నాగిని చితక్కొట్టే సీన్లు బాగా తీసినట్టు ఉన్నారు. నిజం చెప్పాలంటే... 'వకీల్ సాబ్' కంటే ముందు టీవీ ప్రేక్షకులకు లిరీషా తెలుసు. 'అమ్మనా కోడలా', 'అక్కాచెల్లెళ్లు' సీరియళ్ళలో నటించారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.