English | Telugu

రాగ‌సుధ‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న లాయ‌ర్‌!


బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించిన సీరియ‌ల్ ఇది. వ‌ర్ష ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంత‌గా ప్ర‌సారం అవుతోంది. ఇత‌ర పాత్ర‌ల్లో జ‌య‌ల‌లిత, జ్యోతిరెడ్డి, బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్‌, క‌ర‌ణ్‌, మ‌ధుశ్రీ‌, ఉమాదేవి, సందీప్ త‌దిత‌రులు న‌టించారు.

కోర్టులో రాగ‌సుధ .. అనుని అడ్డంగా ఇరికించాల‌ని చూస్తుంది. అను స‌హాయం వ‌ల్లే తాను ఇదంతా చేయ‌గ‌లిగాన‌ని చెబుతుంది. దీంతో లాయ‌ర్ అనుని క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిందిగా జ‌డ్జిని కోర‌డంతో అనుమ‌తిస్తాడు. ఆ వెంట‌నే అనురాధ‌ని బోన్ లోకి పిలుస్తారు. "పెళ్లికి ముందు మీకు ఆర్య వ‌ర్ధ‌న్ గారి గ‌తం గురించి పూర్తిగా తెలుసా?" అని అడుగుతాడు లాయ‌ర్‌. అను, "తెలుసు" అంటుంది. ఎలా అని అడిగితే ఆయ‌నే చెప్పారంటుంది. ఏమ‌ని చెప్పార‌ని అడిగితే.. రాజ‌నందినితో జ‌రిగిన వివాహం గురించి.. తాను ప్ర‌మాదవ‌శాత్తు చ‌నిపోవ‌డం గురించి మొత్తం చెప్పారు అంటుంది.

దీంతో లాయ‌ర్ "అంటే.. రాజ‌నందినిది ప్ర‌మాద వ‌శాత్తు జ‌రిగిన మ‌ర‌ణం త‌ప్ప హ‌త్య అని చెప్ప‌లేదు ఔనా" అంటాడు.. అను "అవును" అన‌డంతో "నోట్ దిస్‌ పాయింట్ యువ‌ర్ ఆన‌ర్" అంటాడు లాయ‌ర్. అయితే ఆర్యవ‌ర్ధ‌న్ త‌రుపున వాదించ‌డానికి వ‌చ్చిన లాయ‌ర్ అస‌లు విషయాన్ని రాగ‌సుధ నుంచి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. దీంతో క‌న్ఫ్యూజ్ అవుతూ ఒక‌సారి ఒక‌లా మ‌రో సారి మ‌రోలా స‌మాధానం చెబుతూ కంగారు ప‌డుతూ వుంటుంది రాగ‌సుధ‌.

విష‌యం ప‌సిగ‌ట్టిన లాయ‌ర్.. రాగ‌సుధ‌ని మ‌రింత‌గా ఇబ్బంది పెట్ట‌డం మొద‌లు పెడ‌తాడు.. దీంతో ఎక్క‌డ దొరికిపోతానో అని రాగ‌సుధ‌కు చెమ‌ట‌లు ప‌ట్టేస్తుంటాయి. ఈ లోగా రాగ‌సుధ త‌రుపు లాయ‌ర్ మా వ‌ద్ద బ‌ల‌మైన సాక్ష్యాలు వున్నాయ‌ని ఆస్తి ప‌త్రాలు చూపిస్తాడు. అవి ఒరిజిన‌లే అని గ్యారంటీ ఏంట‌ని ఆర్యవ‌ర్థ‌న్ లాయ‌ర్ ప్ర‌శ్నిస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపు తిరిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.