English | Telugu

తులసిని విలన్ అంటూ దూషించిన కొడుకు అభి!

ఎట్టకేలకు లాస్య బుట్టలో పడిపోయింది గాయత్రి. లాస్య కుట్ర చేయడానికి ఇచ్చిన సలహా చాలా బ్రహ్మాండమని కౌగిలించుకుని థాంక్స్ చెప్తుంది. మరో పక్క గాయత్రి భర్త అంకిత పేరు మీద ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్తుంటాడు. గాయత్రీ కాఫీ తీసుకొచ్చి భర్త మనసులో ఈ విషపు మాటను నాటేద్దామని వెళ్తుంది. భార్య కాఫీ తెచ్చేసరికి ఆశ్చర్యపోయిన భర్త అసలు విషయం తెలుసుకుంటాడు.

'అభి పేరు మీద ఆస్తి రాస్తే అంకిత నన్ను ప్రశ్నిస్తుంది. నేను సమాధానం చెప్పలేను. ఐనా నా కూతురు నా ఆస్తి వద్దనుకుని అత్తారింటికి వెళ్ళింది' అంటూ గర్వంగా చెప్తాడు. అంకితకు ఆస్తి వస్తే అత్తగారు తులసి పేరు మీద రాసేస్తుందని చెప్తుంది గాయత్రి. 'అలా ఏం జరగదు కంగారుపడకు' అంటాడు భర్త. ఐనా ఒప్పుకోకుండా సతాయించేసరికి సరే అని బయలుదేరుతాడు.

మరో వైపు అభి నాన్న నందుకు ఫోన్ చేసి లాస్య తనని ఎంత నమ్మిందో ఆస్తి తన పేరు మీద రాయడానికి ఎంత తాపత్రయ‌పడిందో చాలా సంతోషపడుతూ చెప్తాడు. నందు లాస్యని ఇక అదేపనిగా పొగిడేస్తూ ఉంటాడు. ఆస్తి పత్రాలు అన్ని మార్పించి ఇంటికి తీసుకొస్తాడు గాయత్రీ భర్త. అది చూసి 'అంకిత పేరు మీదకే ఎందుకు మార్పించారు? అల్లుడు మంచోడే కదా.. నేను చెప్పినట్టు ఎందుకు చేయలేదు' అంటూ అరుస్తుంది గాయ‌త్రి.

'తులసి చెప్పింది అంకిత పేరు మీద ఆస్తిని రాయించమని' అని చెప్తాడు. ఈ విషయాలన్నీ విన్న అభి.. తులసి దగ్గరకు వెళ్లి 'నన్ను ఎదగకుండా చేసిన దోషివి నువ్వే' అంటూ తల్లిని నానా మాటలు అంటాడు. మిగతా హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం స్టార్ మాలో ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.