English | Telugu

వెదర్ కో- ఆపరేట్ చేస్తుంది అందుకే కైట్ ఎగురుతుంది

నవ్య స్వామి, రవికృష్ణ ఏ షోలో చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు. వీళ్లిద్దరి జంట బుల్లి తెర మీద మస్త్ ఫేమస్. "నా పేరు మీనాక్షి" సీరియల్ తో నవ్య స్వామి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. ఈ స్మాల్ స్క్రీన్ బ్యూటీ కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైన నవ్య తమిళ్ లో, తెలుగులో సీరియల్స్ చేస్తూ అభిమానుల్ని పెంచుకుంటోంది. స్టార్ మాలో ప్రసారమైన "ఆమె కథ" సీరియల్ లో రవికృష్ణ , నవ్యస్వామి కలిసి నటించారు.

అప్పటి వరకు వాళ్ళ ప్రేమ కొంతవరకే ప్రపంచానికి తెలుసు కానీ ఈ సీరియల్ తర్వాత వీళ్ళ ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఢీ 14 డాన్స్ షోకి ఇద్దరూ కలిసి టీమ్ లీడర్లుగా పని చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఢీ 14 షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ప్రదీప్ వేసే జోకులకు అడ్డుఅదుపు ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ లేటెస్ట్ ఎపిసోడ్ లో నవ్యస్వామికి ఒక టిపికల్ క్వశ్చన్ వేస్తాడు ప్రదీప్. "సంక్రాంతి రోజు కైట్ ఎందుకు ఎగరేస్తారు" అని అడుగుతాడు. "అప్పుడు వెదర్ కొంచెం కో- ఆపరేట్ చేస్తుంది కాబట్టి కిట్స్ ఎగరేస్తారు" అంటుంది నవ్యస్వామి. అదేంటి పతంగికి వెదర్ కో-ఆపరేట్ చేస్తుందా అంటూ నవ్వుతాడు ప్రదీప్ . మేమైతే ఇంట్లోనే పతంగులు ఎగరేసుకుంటూ ఉంటాం అంటూ ఫన్ చేస్తాడు. ఫైనల్ గా అందరూ హోలీ కలర్స్ చల్లుకుని ఢీ స్టేజిని రంగులమయం చేసేస్తారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.