English | Telugu

సార్ ఆ పబ్ అడ్రస్ ఇవ్వండి ఒకసారి...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అమర్ దీప్ అమ్మాయిలు వేసుకునే చెప్పులు వేసుకొచ్చి సల్మాన్ ఖాన్ లా షర్ట్ తీసేసి దాన్ని అటు ఇటు తిప్పుతూ బెల్లి డాన్స్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో నిఖిల్ విజయేంద్ర సింహ మైక్ పట్టుకుని "ఎంత దిక్కుమాలిన దురదృష్టంలో ఉంటాడో ఈ మనిషి ఒకసారి జూబ్లీహిల్స్ లో ఒక పార్టీకి ఇలాగే షూటింగ్ జరుగుతోంది...ఇద్దరే ఉన్నారు అమరదీప్ ఇంకో అమ్మాయి." అంటూ ఏదో సీక్రెట్ రివీల్ చేయబోతుండగా అమరదీప్ కంగారు పడిపోయి "అమ్మో అది వర్క్ అది వర్క్" అని చెప్పి తప్పించుకోబోయాడు కానీ శ్రీముఖి ఊరుకోలేదు. "పెళ్ళికి ముందా.

పెళ్లి తర్వాత" అని అడిగింది. "మొన్నమొన్న ఇది జరిగింది. కానీ అక్కడ ఉన్నది వీళ్ళ వైఫ్ కాదు " అని చెప్పాడు నిఖిల్. "బేసిక్ గా ఆ పిల్ల బిల్లు కట్టమంటే బెంచ్ కింద బిల్ పడిపోయిందని చెప్తే వెతికి ఇచ్చాను" అని చెప్పాడు. దాంతో ఇమ్మానుయేల్ "ఆ బిడ్డకు కవర్ చేసుకోవడం కూడా రాదురా" అనేసరికి అందరూ నవ్వేశారు. తరువాత డెబ్జానీని శ్రీముఖి అడిగింది "అసలు పార్టీకి వెళ్లే ముఖమేనా మనది" అని అడిగింది. "హా వెళ్తాను. చాల మంది ఫ్రెండ్స్ ఉంటారు. 12 .30 వరకు మిడిల్ అంతవరకు ఒకే.. ఆ తర్వాత అందరికీ లవ్ యు అని చెప్తా 2 - 3 టైం గడిచాక నువ్వే నా సొంతం, నువ్వే నా జీవితం, నువ్వే అన్నీ అని చెప్తూ ఉంటా. నేను ఒక రకమైన ఫోజ్ పెదమనుకుంటా కానీ వాళ్ళు ఇంకో రకం ఫోజుల్లో ఉన్నప్పుడు ఫొటోస్ తీస్తారు" అని కామెడీగా చెప్పుకొచ్చింది. దాంతో అమరదీప్ ఐతే "సర్ ఆ పబ్ అడ్రెస్స్ ఇవ్వండి ఒకసారి" అని అడిగాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.