English | Telugu

'ఖుష్బూ! ఢీ జోడికి మ‌నిద్ద‌రం వెళ్దామా?'.. అడిగిన బులెట్ భాస్కర్

ఎక్స్ట్రా జబర్దస్త్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. గురు, శుక్రవారాల్లో వచ్చే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ మంచి కామెడీని పంచుతూ ఉంటాయి. వీటికి మంచి టీఆర్పీ కూడా వ‌స్తోంద‌న‌డంలో సందేహం లేదు. ఈ స్టేజెస్ మీద నుంచి వెళ్లిన ఎంతోమంది కూడా ఇప్పుడు మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ షోకి గెటప్ శీను రీఎంట్రీ అద్దిరిపోయింది. ఈ ఎపిసోడ్ లో ఖుష్బూతో కలిసి బులెట్ భాస్కర్ చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రోహిణి కూడా బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్నతో కలిసి మంచి కామెడీని పండించింది. హహ హాసిని అంటూ రోహిణి బొమ్మరిల్లులో జెనీలియాలా స్కిట్ ప్లే చేసింది. సిద్ధార్థ్ క్యారెక్టర్ లో భాస్కర్ వాళ్ళ నాన్న సిద్ధుగా వ‌చ్చాడు.

"గోధుమపిండి బాగా గుద్ది గుద్ది ముద్ద చేసినట్టుగా ఉన్నావ్, నువ్ సిద్ధూవా?" అంది రోహిణి. "ఛీఛీ పోపో".. అని ఆమె అంటున్నా, భాస్కర్ వాళ్ళ నాన్న అక్కడి నుంచి కదలకుండా కొద్దిసేపు ఆమెను అలాగే చూసి, తర్వాత వెళ్ళిపోతుంటాడు. వెంటనే రోహిణి, "ఓయ్.. అంతేనా?".. అంటూ మళ్ళీ కవ్వించింది. "ఇంకేంటి .. ఇంకేం కావాలా?" అని అడిగి మంచి ఫన్ క్రియేట్ చేశాడు భాస్కర్ వాళ్ళ నాన్న.

ఈ రాబోయే ఎపిసోడ్ లో బులెట్ భాస్కర్ తెల్ల తెల్లని చీర పాటకు వర్షతో కలిసి దుమ్ము రేపే డాన్స్ చేసేశాడు. తర్వాత "రాను..రానంటూనే చిన్నదో" పాటకు ఖుష్బూ, భాస్కర్ కలిసి స్టెప్పులేశారు. పాట ఐపోయాక ఖుష్బూతో, "నెక్ట్స్‌ ఢీ జోడిలోకి మనిద్దరం వెళ్దామా, వెళ్తే అదే లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది" అన్నాడు భాస్కర్. దీంతో ఖుష్బూ ఒక్కసారిగా నవ్వేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.