English | Telugu

Karthika Deepam2 : తండ్రి అక్రమ సంబంధం బయటపడుతుందేమోనని కొడుకు ఆవేదన...


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -140 లో... జ్యోత్స్నకి దాస్ నిజం చెప్పేస్తాడు. ఆ ఇంటి పనిమనిషి కూతురువి నువ్వు.మ నేను నీ కన్న తండ్రిని.. ఆ బిడ్డలని మార్చింది నా తల్లి పారిజాతం అని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. నువ్వు నేల మీద ఉండడం లేదు.. డబ్బుతో గర్వం పట్టి ఉన్నావ్.. అందుకే నీ స్థాయి ఏంటో చెప్పాను.. ఇక నుండి అయిన పద్ధతిగా ఉండు.. అందరికి నిజం తెలిసిన రోజు.. నీ పరిస్థితి గురించి ఆలోచించమని దాస్ చెప్తాడు. నేను నమ్మలేక పోతున్నానని జ్యోత్స్న అనగానే.. వెళ్లి మా అమ్మ పారిజాతాన్ని అడుగమని దాస్ చెప్తాడు.

మరొకవైపు అనసూయ, దీపలు ఇంటికి వస్తారు. అప్పుడే శౌర్యని తీసుకొని కార్తీక్ వస్తాడు. శౌర్యా నా సైకిల్ తెచ్చారా అంటూ అడుగగా.. తెచ్చానని దీప చెప్పగానే.. శౌర్య వెళ్తుంది. కార్తీక్ తో దీప మాట్లాడుతుంది. మీరేదో మాట్లాడాలన్నారు ఏంటని కార్తీక్ అడుగుతాడు. ప్రొద్దున కాశీ, దాస్, బాబాయ్ లు ఇక్కడికి వచ్చారని దీప అంటుంది. అవును దాస్ మావయ్య అవుతాడు.. కాశీ బామ్మరిది అవుతాడని కార్తీక్ అంటాడు. ఈ విషయం ముందే తెలుసా అని దీప అడుగగా.. లేదని కార్తీక్ అంటాడు తెలిస్తే చెప్పేవాడిని కదా. ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్.. స్వప్న, కాశీల పెళ్లి జరగాలంటే మా నాన్న రెండో పెళ్లి విషయం బయటపడుతుంది. మనకి టైమ్ కూడా లేదు. స్వప్న నాన్న పెళ్లి ఫిక్స్ చేసాడంట అని కార్తీక్ అంటాడు. కంగారు పడకండి.. ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దామని దీప అంటుంది.

మరొక వైపు జ్యోత్స్న కోపంగా ఇంటికి వస్తుంది. దాస్ మాటలు గుర్తుచేసుకుంటుంది. నేను ఈ ఇంటి వారసురాలి స్థానంలో బ్రతుకుతున్నాను కానీ పనిమనిషి కూతురినా అని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి.. నా కొడుకుని ఏమైనా అన్నావా అని అడుగుతుంది. ఆ రోజు రెస్టారెంట్ లో తండ్రిని కూతురు కొట్టడం తప్పు కదా అని అనగానే.. పారిజాతం షాక్ అవుతుంది. నేను కళ్యాణి కూతురిని కదా అంటూ జ్యోత్స్న చెప్పగానే.. ఇదంతా నీకెలా తెలుసు.. తప్పు చేసానని పారిజాతం అంటుంది. లేదు మంచి పని చేసావ్.. లేదంటే ఆ కాశీ గాడి లాగే ఉండేదాన్ని పనిమనిషి కూతురిని యజమాని చేసావని అంటుంది. అప్పుడే దాస్ వస్తాడు. జ్యోత్స్నని లోపలికి పంపించి ఈ నిజం నీకెలా తెలుసని దాస్ ని పారిజాతం అడుగుతుంది. అప్పుడు నేను అంతా చూసానని దాస్ చెప్పగానే.. పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.