English | Telugu

నెల్లూరులో టైటానిక్ ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేసిన శౌర్య‌!

'కార్తీకదీపం' సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సీరియల్ లో వంటలక్క కూతురిగా శౌర్య యాక్ట్ చేసింది. వంటలక్క పాత్రతో పోటీ పడి మరీ నటించింది. ఈ చిన్నారి నటనకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. రీల్ నేమ్ శౌర్య ఐతే రియల్ నేమ్ కృతిక. ఐతే కృతిక ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది.

ఎక్కడ చూసినా టైటానిక్ ఐస్ క్రీం తింటూ ఇచ్చిన పోజ్ మంచి కామెంట్స్ ని అందుకుంటోంది. ఇదే కాదు "బృందావనంలో కృష్ణుడు వచ్చాడే" అనే సాంగ్ కి వేసిన స్టెప్స్ తో ఎంతో మంది ఫిదా ఇపోయారు కూడా. కృతిక కళ్ళను పొగుడుతూ ఇన్స్టాగ్రామ్ లో చాలామంది క్యూట్, సూపర్ ఐస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐతే నెల్లూరు వెళ్లిన కృతిక అక్కడ మురళీకృష్ణ రెస్టారెంట్ లో టైటానిక్ ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. "నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నా. మరి మీరు ఈ సమ్మర్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?" అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కృతిక. నెటిజన్స్ కూడా "మా నెల్లూరు ఎప్పుడు వచ్చావ్?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'కార్తీక దీపం' సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ లో చిన్నారులు కృతిక, సహృద నటించి అందరిని మెప్పించారు. ఐతే నెమ్మది నెమ్మదిగా అన్ని కేరక్టర్స్ ని ఆపేయడంతో 'కార్తీక దీపం' సీరియల్ కి రేటింగ్ కూడా తగ్గిపోయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.