English | Telugu

నిజం తెలుసుకున్న మోనిత‌..రౌడీల‌కు చుక్క‌లు చూపించిన కార్తీక్‌

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. కార్తీక్‌, దీప‌, మోనిత ల చుట్టూ తిరిగే రివేంజ్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర ఈ సీరియ‌ల్ ని రూపొందిస్తున్నారు. ఊహించ‌ని మ‌లుపులు, ట్విస్ట్‌ల‌తో నిరంతరాయంగా సాగుతూనే వుంది. తాజాగా ఈ సోమ‌వారం 1221వ ఎపిసోడ్ లోకి ఈ సీరియ‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. శ్రీ‌వ‌ల్లి పురిటి నొప్పులు పడుతుంటే దీప చ‌లించిపోతుంది.

ఎలాగైనా త‌న‌కు వైద్యం చేయ‌మ‌ని భ‌ర్త డాక్ట‌ర్ బాబుని నిల‌దీస్తుంది. ఈ ఉప‌ద్ర‌వం నుంచి త‌ప్పించుకోవాల‌ని అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాడు. దాంతో శ్రీ‌వ‌ల్లిని అంబులెన్స్ లో ఆసుప‌త్రికి తీసుకెళ‌తారు. సీన్ క‌ట్ చేస్తే మోనిత .. డాక్ట‌ర్ బాబు గురించే ఆలోచిస్తూ వుంటుంది. ఇలా ఆలోచిస్తూనే కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కానీ అది మ‌హేష్ ద‌గ్గ‌ర వుండ‌టంతో త‌ను లిఫ్ట్ చేస్తాడు. కార్తీక్ .. ఎక్క‌డున్నావ్‌.. ఏమైపోయావ్ అని అరుస్తుంది. దీంతో చిరాకొచ్చిన మ‌హేష్ కార్తీక్ ఎవడు అనేస్తాడు.

శ్రీ‌వ‌ల్లి ఎవ‌రు?.. కార్తీక్‌ని ఇబ్బందిపెట్టిన దీప‌

ఇంత‌కీ నువ్వు ఎవ‌డివిరా అంటుంది మోనిత‌... మ‌ర్యాద అంటూనే కార్తీక్ గురించి చెప్పాలంటే డ‌బ్బుల‌వుతాయంటాడు. అకౌంట్ నెంబ‌ర్ చెప్పు పంపిస్తా అంటుంది మోనిత‌. ఆ త‌రువాత మ‌హేష్ తాను చూసింది .. కార్తీక్‌, దీప పిల్ల‌ల‌తో క‌లిసి ఊరు విడిచి వెళ్లింది చెబుతాడు.. దీంతో విసుక్కున మోనిత సౌంద‌ర్య ఆంటీకి తెలిసే ఇదంతా జ‌రుగుతోందా? అని అనుమానిస్తుంది. క‌ట్ చేస్తే శ్రీ‌వ‌ల్లి ఇంటి సామాను చెట్టుకింద వుండ‌టం చూసిన కార్తీక్ వాటిని ఇంటికి చేర్చ‌బోతుంటాడు. ఇంత‌లో రుద్రాణికి సంబంధించిన ముగ్గురు రౌడీలు వ‌చ్చి `మేం ఎవ‌రిమో తెలుసా ` అంటూ కార్తీక్‌ని బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌నుషులే గా అని స‌మాధానం చెబుతాడు కార్తీక్‌. అడ్డు త‌గిలిన రౌడీల‌కు కార్తీక్ చుక్క‌లు చూపిస్తాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.