English | Telugu

రొమాన్స్‌లో నిండా మునిగిపోయిన మోనిత‌, ఆదిత్య!

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ఇందులో మోనిత పాత్ర‌లో శోభాశెట్టి త‌న‌దైన న‌ట‌న‌తో విల‌న్ గా ఆక‌ట్టుకుంటూ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే సీరియ‌ల్ లో డాక్ట‌ర్ బాబు సోద‌రుడిగా ఆదిత్య పాత్ర‌లో న‌టించిన య‌శ్వంత్ కూడా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఇందులో శోభాశెట్టి, య‌శ్వంత్ వ‌దినా మ‌రుదులుగా న‌టించారు.

క‌ట్ చేస్లే ఈ ఇద్ద‌రు క‌లిసి రొమాన్స్ చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. విష‌యం తెలిసిన వాళ్లంతా 'ఏంటీ డాక్ట‌ర్ బాబు.. ఏం జ‌రుగుతోంది?' అంటూ కామెంట్ లు చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే... మోనిత‌గా న‌టిస్తున్న శోభా శెట్టి, ఆదిత్య‌గా న‌టిస్తున్న య‌శ్వంత్ ఆఫ్ స్క్రీన్ లో మంచి ఫ్రెండ్స్‌. యూట్యూబ్ ఛాన‌ల్ లో ఇద్ద‌రు జంట‌గా క‌నిపించిన సంద‌ర్భాలున్నాయి. ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ మ్యూజిక్ ఆల్బ‌మ్ కోసం వ‌ర్షంలో త‌డుస్తూ రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం, శోభా శెట్టికి య‌శ్వంత్ ముద్దు పెట్ట‌డం హాట్ టాపిక్ గా మారింది.

వీరిద్ద‌రూ క‌లిసి `బుజ్జి బంగారం` అనే ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్ లో న‌టించారు. శోభా శెట్టి న‌టించి ప్రొడ్యూస్ చేసింది. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ , సెకండ్ లుక్ పోస్ట‌ర్ లు ఇప్ప‌టికే నెట్టింట సంద‌డి చేశాయి. తాజాగా ఈ ఆల్బ‌మ్ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ ని విడుద‌ల చేశారు. ఇందులో ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్, కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. ఈ వీడియోలో య‌శ్వంత్‌.. శోభా శెట్టిపై ముద్దుల వ‌ర్షం కురిపించాడు. దీంతో ఇప్పుడు ఈ జంట నెట్టింట వైర‌ల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.