English | Telugu

"గ‌ల‌గ‌ల పారుతున్న గోదారిలా" పాడిన వ‌ర్ష‌.. మ‌హేశ్‌కు ప్ర‌దీప్ వివ‌ర‌ణ‌!

అందంగా కనిపించే అమ్మాయిలు అందరికీ అందమైన గొంతు ఉండాలని రూలేం లేదు. అలాగే, అందంగా పాడే అమ్మాయిలు అంతా చూపులు పరంగా అందంగా ఉంటారని చెప్పలేం. ఎవరి టాలెంట్ వాళ్లది. లేటెస్ట్ టీవీ సెన్సేషన్ వర్ష అందంగా ఉంటుంది. కానీ, గొంతు మాత్రం అదోలా ఉంటుంది. అంటే... కొంచెం రఫ్‌గా అన్నమాట. ఆ గొంతుతో 'గలగల పారుతున్న గోదారిలా' పాట పాడింది. ఇంకేముంది? పక్కనున్న ప్రదీప్ వెంటనే పంచ్ వేశాడు.

ఈటీవీ 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన వర్ష సీరియళ్ళలో కూడా నటిస్తోంది. జీ తెలుగు ఛానల్‌లో వచ్చే 'ప్రేమ ఎంత మధురం'లో ఆమె కీ రోల్ చేస్తోంది. ప్రజెంట్ జీ తెలుగులో 'సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్' ఈవెంట్ చేస్తోంది. అందులో రెండు సీరియల్ టీమ్స్ మధ్య పోటీలు పెడుతున్నారు. ఈ ఆదివారం 'రామ సక్కని సీత', 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ టీమ్స్ మధ్య పోటీ. రెండు సీరియళ్లలో నటిస్తున్న యాక్టర్లు స్టేజి మీదకు వచ్చారు.

'గల గల పారుతున్న గోదారిలా' అని వర్ష పాట పాడింది. 'మహేష్ బాబు గారూ... నేను మామూలుగా బాగా పాడతారనుకుని అడిగాను సార్' అన్నాడు ప్రదీప్. బాగా పాడలేదని సెటైర్ వేశాడు. పాపం వర్ష... తనలో బాధను అలా దాచుకుంది. 'పోకిరి'లో 'గలగల పారుతున్న గోదారిలా' పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.