English | Telugu

Karthika Deepam 2 : జ్యోత్స్న గ్రిప్ లోకి శివన్నారాయణ‌.. ఇక కార్తీక్, దీపలకి కష్టాలే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -222 లో.. జ్యోత్స్న త్వరగా కోలుకుంటుందని శివన్నారాయణ‌ స్వార్థంగా అలోచించి.. కార్తీక్ కాంచనలని తన ఇంటికి రమ్మని అడుగుతాడు. దీప, శౌర్యలని వద్దని అంటాడు. నా భార్య దీప, నా కూతురు శౌర్య అని దీప భుజంపై చెయ్యి వేసి మాట్లాడతాడు కార్తీక్. వాళ్ళను వదిలి పెట్టి రానని కార్తీక్ అనగానే.. దాంతో శివన్నారాయణ కోప్పడతాడు. నేను ఒక మెట్టు దిగి వచ్చాను.. అలా అని ఇలా పొగరుగా మాట్లాడుతున్నావని అంటాడు.

నువ్వేమంటావని శివన్నారాయణ కాంచనని అడుగగా.. నా కోడలు వాళ్లు వస్తేనే వస్తానంటుంది. అవసరమైతే మీరే మా ఇంటికి రండి అనగానే.. దీపపై శివన్నారాయణ కోప్పడతాడు. ఇంకొకసారి ఇక్కడికి రానని వెళ్ళిపోతాడు శివన్నారాయణ‌. ఎందుకు అలా మాట్లాడారని కాంచనతో దీప అంటుంది. మరొకవైపు శివన్నారాయణ ఇంటికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళందరు దీప గ్రిప్ లో ఉన్నారని దీప గురించి నెగెటివ్ గా పారిజాతం, జ్యోత్స్న మాట్లాడతారు. నేను వాళ్లకి బుద్ది చెప్పాలనుకుంటున్నానని శివన్నారాయణని జ్యోత్స్న అడుగగా.. నీ ఇష్టమని శివన్నారాయణ‌ అంటాడు. ఆ తర్వాత ఇక దీప సంగతి చెప్తాను. బావ, దీపలని వేరు చేయాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది.

మరొకవైపు స్వప్న, కాశీలు కలిసి దీప, కార్తీక్ ల పేరు మీద ఫుడ్ కోర్ట్ పెట్టాలని అనుకుంటారు. ఆ తర్వాత దాస్ దగ్గరికి కాశీ వెళ్తాడు. నువ్వు వెతకాలనుకున్న అతను దొరికాడా అని అడుగుతాడు. కాశీకి అర్థం కాకుండా దాస్ మాట్లాడతాడు. మరొకవైపు దీప బాధపడుతుంటే కార్తీక్ వస్తాడు. ఎందుకు బాబు.. మీ తాతయ్య గారితో కలిసే ఛాన్స్ వస్తే ఇలా చేసారని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.