English | Telugu

తెలుగు బుల్లితెర‌పై క‌న్న‌డ రౌడీ బేబీ!

ఇప్ప‌టికే తెలుగు బుల్లితెర‌ను ప‌లువురు క‌న్న‌డ భామ‌లు ఏలుతుండ‌గా, లేటెస్ట్‌గా మ‌రో క‌న్న‌డ న‌టి ప‌రిచ‌యం కాబోతోంది. ముత్య‌మంత ముద్దు సీరియ‌ల్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఆ తార‌.. నిషా ర‌వికృష్ణ‌న్. వ‌చ్చే సోమ‌వారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆ సీరియ‌ల్ తొలి ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది. నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఆ సీరియ‌ల్‌లో హీరోయిన్ గీత క్యారెక్ట‌ర్‌ను పోషిస్తోంది నిష‌. క‌థ ప్ర‌కారం ఆమె త‌మిళియ‌న్‌గా క‌నిపించ‌నున్న‌ది.

ఇంట్లో చిన్న కూతురైన ఆమె పెళ్ల‌య్యాక త‌న అత్తామామ‌ల‌తో పాటు అమ్మానాన్న‌లు కూడా ఒకే ఇంట్లో ఆనందంగా గ‌డ‌పాల‌ని ఆశిస్తుంటుంది. అలాంటి ఆమె గోవింద్ అనే యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డుతుంది. ఆ పాత్ర‌ను సిద్ధార్థ్ వ‌ర్మ చేస్తున్నాడు. అత‌నిది పాత త‌ర‌హా ప‌ద్ధ‌తి. కోడ‌లు ఇంట్లో ఉండి ప‌నిపాట‌లు చూసుకోవాల‌ని, పెళ్లిలో క‌ట్నం తీసుకోవాల‌నే టైప్‌. రెండు భిన్న ధ్రువాలైన ఆ ఇద్ద‌రికీ ఎలా సెట్ట‌వుతుందనేది ఆస‌క్తిక‌రం.

క‌న్న‌డంలో నిష‌కు "రౌడీ బేబీ" అని పిలుస్తుంటారు. అంటే 'గ‌ట్టిమేళ' సీరియ‌ల్‌లోని పాత్ర ద్వారా ఆమెకు ఆ పేరు వ‌చ్చింది. ఆ సీరియ‌ల్ టీఆర్పీలో టాప్‌గా నిలిచింది. అక్క‌డ ఎలా అయితే త‌ను స‌క్సెస్ అయ్యిందో తెలుగులోనూ అలాంటి స‌క్సెస్‌ను అందుకుంటాన‌ని న‌మ్ముతోంది నిష‌.

ఆమెకు క‌న్న‌డ సినిమాల ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో ఆమె 'అండోడిత్తు కాల' సినిమాలో హీరోయిన్‌ పాత్ర‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌నుంది. హీరోగా విన‌య్ రాజ్‌కుమార్ న‌టిస్తోన్న ఆ మూవీలో అదితి ప్ర‌భుదేవా మ‌రో హీరోయిన్‌.

చైత్ర రాయ్‌, మంజుల‌, మేఘ‌నా లోకేశ్‌, న‌వ్య స్వామి, నిత్యా రామ్‌, చంద‌న‌, కావ్య‌శ్రీ లాంటి క‌న్న‌డ తార‌లు తెలుగు సీరియ‌ల్స్ ద్వారా పాపుల‌ర్ అయ్యారు. నిష కూడా వారి త‌ర‌హాలో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.