English | Telugu

క‌మ్యూనిటి చిక్కుల్లో కాజ‌ల్‌..హ‌గ్గుతో సిరి గేమ్ స్టార్ట్‌

బిగ్‌బాస్ 13వ వారం నామినేష‌న్‌ల ప్ర‌క్రియ సోమ‌వారం మొద‌లైంది. ఇందులో భాగంగా ముందు కొంత నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభానికి ముందు ఇంటి కెప్టెన్ ష‌ణ్ముఖ్ .. ప్రియాంక‌తో మాట్లాడుతూ .. స‌న్నీ , మాన‌స్‌, కాజ‌ల్ ధైర్యం ఏంటంటే.. నిన్నేం చేసినా వాళ్ల‌ని నువ్వు నామినేట్ చేయ‌వు. ఎదురుతిర‌గ‌వ‌ని వాళ్ల న‌మ్మ‌కం. మొత్తానికి నువ్వు వాళ్ల కంట్రోల్‌లో వున్నావ‌నుకుంటున్నారు` అని ప్రియాంక‌ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.

ఆ త‌రువాతే నామినేష‌న్ ప్రక్రియ మొద‌లైంది. ఇంటి స‌భ్యులు త‌గిన కార‌ణాలు చెప్పి ఇద్ద‌రు స‌భ్యుల ముఖం వున్న బాల్స్‌ని బిగ్‌బాస్ ఇంటి నుంచి గేట్ బ‌య‌టికి త‌న్నాలి. ముందుగా ష‌ణ్ముఖ్ .. క‌మ్యూనిటీ పేరుని కాజ‌ల్ వాడ‌టం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని త‌ని నామినేట్ చేస్తూ బాల్‌ని త‌న్నాడు. ఆ త‌రువాత ప్రియాంక‌ని నామినేట్ చేశాడు. ఆ త‌రువాత వ‌చ్చిన ప్రియాంక త‌నకు ఎలాంటి పాయింట్‌లు లేవ‌ని, త‌న‌కు కాస్త టైమ్ కావాలంది. టైమ్ ఎక్కువ తీసుకోవ‌డంతో బిగ్‌బాస్ బిగ్‌బాస్ ఆదేశాల‌ని పాటించ‌క‌పోతే నేరుగా నామినేట్ అవుతావంటూ బిగ్‌బాస్ హెచ్చ‌రించాడు. దీంతో త‌ను సిరిని నామినేట్ చేసింది. ఆ త‌రువాత క‌మ్యూనిటీ వ‌ర్డ్‌ని వాడ‌టం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని కాజ‌ల్‌ని కూడా నామినేట్ చేసింది.

ఇక శ్రీ‌రామ‌చంద్ర త‌న‌ని అగౌర‌వప‌రిచారంటూ మాన‌స్‌, కాజ‌ల్‌ల‌ని నామినేట్ చేశాడు. ఇక ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవ్వ‌కుండా నీగేమ్ నువ్వు ఆడ‌మంటూ సిరి.. ప్రియాంక‌ని నామినేట్ చేసింది. అలాగే క‌మ్యూనిటీ వ‌ర్డ్ వాడ‌టం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని కాజ‌ల్‌ని నామినేట్ చేసింది. స‌న్నీ .. సిరి, శ్రీ‌రామ‌చంద్ర‌ల‌ని నామినేట్ చేశాడు. ఆ త‌రువాత మాన‌స్ ... సిరిని, శ్రీ‌రామ‌చంద్ర‌ని నామినేట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌రామ‌చంద్ర‌, మాన‌స్‌ల మ‌ధ్య చిన్న వాగ్వివాదం జోటుచేసుకుంది. ఇక సోమ‌వారం ఎంటైర్ ఎపిసోడ్‌లో మ‌ళ్లీ సిరి, ష‌న్నుల హ‌గ్ హాట్ టాపిక్‌గా మారింది. సిరి త‌ల్లి, ప్రియుడు శ్రీ‌హాన్‌, ష‌న్ను త‌ల్లి ప్ర‌త్యేకంగా చెప్పినా వారి మాట‌ల్ని లెక్క‌చేయ‌ని సిరి మ‌ళ్లీ ష‌న్నుని హ‌గ్ చేసుకోవ‌డం... ఈ సంద‌ర్భంగా కెమెరాని చూస్తూ మ‌రీ చెప్ప‌డం కొస‌మెరుపు. సిరి మ‌ళ్లీ ష‌న్నుని హ‌గ్ చేసుకోవ‌డంతో మ‌ళ్లీ త‌న గేమ్‌ని స్టార్ట్ చేసింద‌ని నెటిజ‌న్‌లు కామెంట్‌లు చేస్తున్నారు.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.