English | Telugu
జైలు నుంచి బయటికి రావడానికి కైలాష్ కొత్త ప్లాన్!
Updated : Jul 30, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, ఆనంద్, సులోచన, వరదరాజులు తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ట్విస్ట్ లు, మలుపులతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. అమ్మవారికి బోనం సమర్పంచే సమయంలో మాళవిక బోనం చేయి జారి కింద పడి పగిలిపోతోంది. దీంతో వేద తన బోనాన్ని అమ్మవారికి సమర్పించి సోదమ్మ చెప్పిన మాటలు నిజమవుతాయి.
ఆ తరువాత వేద కాలి గాయానికి యష్ మందు రాస్తుంటాడు. కాలికి గాయమైనా ఎలా నడవగలిగావ్.. నేనైతే అలా చేయలేనని యష్ ..వేదతో అంటాడు. అందుకు వేద `నా బిడ్డ కోసం ఎంతటి నొప్పినైనా భరించడానికి సిద్ధమే. నా కడుపున బిడ్డని కనే అదృష్టాన్ని ఆ భగవంతుడు ఎలాగూ ఇవ్వలేదు కనీసం నా బిడ్డని కాపాడుకునే నొప్పినైనా భరించాలి కదా అంటుంది. కట్ చేస్తే .. జైలులో వున్న కైలాష్ దగ్గరికి కాంచన వెళుతుంది. తన వల్లే నీకు ఇలాంటి కష్టం వచ్చిందని, అందుకు తనని క్షమించమని బోరున విలపిస్తుంది. ఇంత జరిగినా గుడ్డిగా కైలాష్ ని నమ్ముతూ వుంటుంది. దీన్ని ఆవకాశంగా తీసుకున్న కైలాష్ ఎలాగైనా జైలు నుంచి బయటపడాలని ప్లాన్ వేస్తాడు..
మీ తమ్ముడు యష్ తలుచుకుంటే క్షణాల్లో నేను బయటికి వస్తానని, కానీ అది నాకు ఇష్టం లేదని, అలా అని నువ్వు ఇంట్లో వాళ్లతో వాదించి నన్ను ఎలాగైనా బయటికి తీసుకురావాలని మీ తమ్ముడు యష్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని కైలాష్ తెలివిగా కాంచనని రెచ్చగొడతాడు. తన ప్లాన్ తెలియని కాంచన ఇంటికి వచ్చాక ఆ విషయాన్ని మాలినితో చెబుతుంది. యష్ ని కేస్ వాపస్ తీసుకోమని చెప్పమంటుంది. అదే విషయాన్ని ఆఫీస్ కి వెళుతున్న యష్ తో మాలిని చెబుతుంది. కానీ యష్ మాత్రం కైలాష్ భవిష్యత్తుని డిసైడ్ చేసేది నేను కాదని ఆ దేవుడని చెబుతాడు.. ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.