English | Telugu

'క్యాష్' నుండి వాకౌట్ చేసిన రాఘవేంద్రరావు!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు మౌనముని అని పేరు. గతంలో ఆయన అసలు సినిమా వేడుకలోనూ, మీడియా ముందు అసలు మాట్లాడే వారే కాదు.‌ 'సౌందర్య లహరి' కార్యక్రమంతో మౌనాన్ని వీడి, మనసులో భావాలను పంచుకోవడం మొదలుపెట్టారు. అయినా... రాఘవేంద్ర‌ రావు పబ్లిక్ గా ఎవరి మీదా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేవు.‌ అటువంటి రాఘవేంద్రుడు ఒక టీవీ షో నుండి వాకౌట్ చేశారు.

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'క్యాష్'కు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'పెళ్లి సందడి' హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీల, దర్శకురాలు గౌరీ రోణంకి, రచయిత శ్రీధర్ సీపాన విచ్చేసారు. వారితో పాటు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు.‌ షో చాలా సరదాగా మొదలైంది. చెట్టు నుండి ఆపిల్ కింద పడడంతో న్యూటన్ గ్రావిటీ థియరీ కనిపెడితే... యాపిల్ ఎక్కడ పడాలో (హీరోయిన్ల బొడ్డు మీద) తాను కనిపెట్టానని రాఘవేంద్రరావు అనడంతో షోలో అందరూ నవ్వేశారు‌.

సరదాగా సాగుతున్న షోలో రాఘవేంద్రరావుకు కోపం తెప్పించిన అంశం... క్యాష్! అవును. తమ చిత్ర బృందం సభ్యులు ఎవరికీ డబ్బులు రాకపోవడంతో చీటింగ్ జరుగుతోందని అందరితో కలిసి వాకౌట్ చేశారు. ఇదంతా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం చేశారో... నిజంగానే వెళ్లిపోయారో... నెక్స్ట్ వీక్ తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.