English | Telugu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌కు ముందే... ఎన్టీఆర్‌ వర్సెస్‌ చరణ్‌!

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కాంబినేషనే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమరం భీమ్‌ రోల్‌ చేస్తున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ షోకు హోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 22 నుంచి టెలికాస్ట్‌ కానుంది. తొలి ఎపిసోడ్‌కు తనతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మరో హీరోగా, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ను ఎన్టీఆర్‌ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇద్దరితో ప్రోమోను రిలీజ్‌ చేశారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌కు ముందు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ టీవీల్లోకి వస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ వీళ్లిద్దరూ మీడియా ముందుకు రాలేదు. సినిమా రిలీజ్‌ అక్టోబర్‌ కావడంతో విజయేంద్రప్రసాద్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో సినిమా గురించి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఏమైనా చెబుతారేమో అనే ఆసక్తి ఆడియన్స్‌లో ఉంది. దాన్ని పక్కన పెడితే... హీరోలిద్దరి మధ్య ఫ్రెండ్షిప్‌ షోలో చూడొచ్చు. ఆల్రెడీ రిలీజైన ప్రొమోలో ఫ్రెండ్షిప్‌ను చూపించడంతో పాటు ‘రామ్‌ వర్సెర్‌ రామ్‌’ అంటూ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు.

హోస్ట్‌ సీట్‌లోకి రామ్‌చరణ్‌ వెళ్లబోతుంటే ‘ఇది హోస్ట్‌ సీట్‌... నాది! అది హాట్‌ సీట్‌... నీది’ అని ఎన్టీఆర్‌ చెప్పడం బావుంది. ఇక, గేమ్‌ మొదలైన తర్వాత ‘సీటు హీటెక్కుతోంది. బ్రెయినూ హీటెక్కుతోంది’ అని రామ్‌చరణ్‌ అన్నారు. అతనికి ఎన్టీఆర్‌ ఏం ప్రశ్నలు వేశారో తెలియాలంటే... ఆగస్టు 22న 8.30 గంటలకు జెమిని టీవీ ఆన్‌ చెయ్యాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.