English | Telugu

మ‌హేశ్ త‌ర్వాత.. తార‌క్ కోసం ప్రభాస్ కూడా!

'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యంగ్ టైగర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తన పరిచయాలు అన్నిటినీ ఉపయోగించి ప్రముఖ హీరోలు, దర్శకులను షోకి రప్పిస్తున్నారు. కోటి రూపాయల కోసం ఆడే ఆటను రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఎపిసోడ్ కోసం ఆయ‌న‌ను తార‌క్ కార్యక్రమానికి తీసుకొచ్చారు. హీరోలు ఇద్దరూ కలిసి చేసిన హంగామా బుల్లితెర వీక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఆ తర్వాత దర్శకులలో తనకు సన్నిహితులైన రాజమౌళి, కొరటాల శివను కూడా షో కి తీసుకోవచ్చారు తార‌క్‌. ఆ ఎపిసోడ్ సోమ‌వారం టెలికాస్ట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తార‌క్‌ కోసం షో కి వచ్చారు. ఇప్ప‌టికే దానికి సంబంధించిన షూటింగ్ పూర్త‌యింది. మహేష్ ఎపిసోడ్ దసరాకి టెలికాస్ట్ కానుంది.

లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... బాహుబలి ప్రభాస్ కూడా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంలో సందడి చేస్తారట.‌ ఆయన్ను తీసుకురావడం కోసం గేమ్ షో నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తార‌క్‌కు ప్రభాస్ కూడా స‌న్నిహితుడే. మ‌రి ఆయ‌న‌ ఏమంటాడో చూడాలి మరి!

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.