English | Telugu

బిగ్‌బాస్ సుజాత నా వ‌ల్ల కాదు నాన్నోయ్ అంటోంది!

న్యూస్ ఛాన‌ల్‌లో జోర్దార్ వార్త‌లు ప్రోగ్రామ్‌తో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన సుజాత ఆ త‌రువాత జోర్దార్ సుజాత‌గా మారిపోయింది. ఆమె క్రేజ్‌ని, మాట తీరు న‌చ్చిన బిగ్‌బాస్ నిర్వాహ‌కులు సీజ‌న్ 4 కోసం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. హౌస్‌లోకి ట్రంకు పెట్టెతో ఎంట్రీ ఇచ్చిన జోర్దార్ సుజాత చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన కింగ్ నాగార్జున‌ని బిట్టూ బిట్టూ అంటూ అల్ల‌రి చేసి చివ‌రికి ఆ పిలుపు కార‌ణంగానే ప్రేక్ష‌కుల ద్వారా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది.

ఇక అభిజీత్ విష‌యంలోనూ బ్యాడ్ అయిపోయిన జోర్దార్ సుజాత ఇక బిగ్‌బాస్ నుంచి తాను ఎందుకు ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చిందో .. తాను నాగార్జున‌ని ఎందుకు బిట్టు అని పిలిచిందో దాని వెన‌కున్న సీక్రెట్‌ని బ‌య‌ట పెట్టేసింది. ప్రస్తుతం `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న `కామెడీ స్టార్స్‌`లో అవినాష్‌తో క‌లిసి ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా వుంటే తాజాగా జోర్దార్ సుజాత ఇన్ స్టా స్టేట‌స్ ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

త‌న మ్యారేజ్ గురించి అభిమానులు ప్ర‌శ్నిస్తుండ‌టంతో ఇక స‌మాధానం చెప్ప‌డం నా వ‌ల్ల కాద‌ని, త్వ‌ర‌గా పెళ్లి చేసేయండి నాన్నా ` అంటూ సుజాత పెట్టిన ఇన్ స్టా స్టేట‌స్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫొటోని అభిమానుల‌తో పంచుకున్న సుజాత త‌న పెళ్లెప్పుడ‌ని అభిమానులు అడుగుతుండ‌టాన్ని తాను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని, త‌న‌కు వెంట‌నే పెళ్లి చేసేయాల‌ని స్టేట‌స్ ని పెట్ట‌డం గ‌మ‌నార్హం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.