English | Telugu

'జోష్‌' మూవీపై సెటైర్లేసిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలు హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇందులో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌ను వేసే పంచ్ లు.. చేసే స్కిట్ లు బుల్లితెర వీక్ష‌కుల్ని విపరీతంగా న‌వ్విస్తున్నాయి. దీంతో మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ మ‌రో స‌రికొత్త న‌వ్వుల షోని `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` పేరుతో గ‌త కొన్ని నెల‌ల క్రితం ప్రారంభించింది. ఈ షో కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటూ ఈటీవీలో మంచి టీఆర్ప‌రేటింగ్‌తో కొన‌సాగుతోంది. ఈ షో ప్రారంభ‌మై వ‌న్ ఇయ‌ర్ పూర్తి కావ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌త్యేక ఎపిసోడ్ ని జ‌న‌వ‌రి 30న ఆదివారం ప్ర‌సారం చేయ‌బోతున్నారు.

ఈ షోలో హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్ర‌సాద్‌, గెట‌ప్ శ్రీ‌ను త‌మ స్కిట్ ల‌తో హంగామా చేశారు. ఇంద్ర‌జ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకు యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా హీరో జెడీ చ‌క్ర‌వ‌ర్తిని ఆహ్వానించారు. `జోష్‌` సినిమాలో త‌న పై చిత్రీక‌రించిన `అన్న‌య్యొచ్చినాడో.. అంటూ సాగే పాట‌తో జెడీ చ‌క్ర‌వ‌ర్తి కి స్వాగ‌తం ప‌లికారు. పాట ఎండ్ కాగానే మైక్ అందుకున్న జేడీ ఈ పాట‌ని స‌జెస్ట్ చేసింది ఎవ‌డ్రా.. ఎవ‌డు ఎవ‌డికి అన్న‌య్య `అంటూ ఫైర‌య్యాడు..

దీంతో `నా కెరీర్‌లో ఫ‌స్ట్ సినిమా `జోష్‌`. అందులో గోడ బ్యాచ్ అని ఓబ్యాచ్ వుంటుంది` అని ఆటో రాంప్ర‌సాద్ చెప్పాడు. దీనికి వెంట‌నే `అప్ప‌టి నుంచి గోడ‌మీదే..` అంటూ జెడీ పంచ్ వేయ‌డంతో అక్క‌డున్న‌వారంతా న‌వ్వేశారు. ఆ త‌రువాత `జోష్` లో రాంప్ర‌సాద్ ఉన్నాన‌ని చెప్ప‌డం నాకు బాధ‌క‌లిగించింది. నువ్వు అందులో వున్నావ‌న్న‌ది నాకు గుర్తులేద‌ని` అన్నాడు జేడీ. `అన్నా అది జ‌నాల‌కి కూడా గుర్తు లేదు మ‌ళ్లీ గుర్తు చేయ‌కండి అన్నాడు రాం ప్ర‌సాద్‌.. ఆ వెంట‌నే `జోష్‌`లో నేనున్న‌ట్టుగా కూడా ఎవ‌డికీ తెలియ‌దు అంటూ `జోష్‌` మూవీపై జెడీ చ‌క్ర‌వ‌ర్తి పంచ్ వేయ‌డం ఇప్ప‌డు వైర‌ల్ గా మారింది. నాగ‌చైత‌న్య హీరోగా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రంలో జెడీ చ‌క్ర‌వ‌ర్తి స్టూడెంట్ లీడ‌ర్ గా విల‌న్ పాత్ర‌లో న‌టించాడు. అయితే తాజాగా `జోష్‌`లో తాను ఉన్న‌ట్టుగా ఎవ‌రికి తెలియ‌ద‌ని సెటైర్ వేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.