English | Telugu

కన్నుల పండువగా అమరదీప్ తేజస్విని ఎంగేజ్మెంట్

జానకి కలగనలేదు హీరో అమరదీప్ చౌదరి, కోయిలమ్మ ఫేమ్ తేజస్విని తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. బుల్లితెర నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అమరదీప్. ఎన్నో తెలుగు సీరియల్స్ ద్వారా, స్పెషల్ షోస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరి నిశ్చితార్థానికి సంబంధించి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తేజస్విని కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన అమ్మాయి. ఈమె కన్నడ నటి ఐనప్పటికీ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది.

ఇలా సీరియల్స్ లో ఒక పాపులారిటీ సంపాదించుకున్న వీళ్ళ ఇద్దరు ఒక ఇంటి వారు కాబోతున్నారు. ఇక వీళ్ళ నిశ్చితార్థానికి టీవీ ఆర్టిస్టులు, యూట్యూబర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లంతా హాజరయ్యారు. వీళ్ళ జంట ఇలా ఎంగేజ్మెంట్ చేసుసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇక వీళ్ళ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు మెస్సేజీలు వెల్లువెత్తుతున్నాయి. అందరి లవ్ స్టోరీలు తెలిసాయి కానీ వీళ్ళ లవ్ స్టోరీ గురించి కొంచెం కూడా అభిమానుల ముందు లీక్ కాకుండా కాపాడుకుని ఇప్పుడు సడన్గా ఎంగేజ్మెంట్ చేసేసుకోవడం ఏమన్నా బాగుందా అంటూ క్యూట్ గా అడుగుతున్నారు నెటిజన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.