English | Telugu

వ‌ర్ష మామూలు స్మార్ట్ కాదు.. హాట్ ఫొటోలకు ట్రోల్ చేసే చాన్స్ ఇవ్వ‌ట్లేదు!

హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడని బుల్లితెర బ్యూటీల్లో వర్ష ఒకరు. ఇటు 'జబర్దస్త్' కామెడీ షో, అటు సీరియల్స్, మధ్య మధ్యలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హాట్ హాట్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లతో ఆడియన్స్‌లో వర్ష క్రేజ్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్టు సోషల్ మీడియాలో చాలా మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

ఫాలోయర్లకు నయనానందం కలిగించడానికి అన్నట్టు హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో హాట్ హాట్ ఫొటోలు దిగుతూ అప్పుడప్పుడూ వర్ష పోస్ట్ చేస్తుంది. కానీ, కామెంట్ చేసే అవకాశం మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. కామెంట్స్ అంటే విమర్శలు మాత్రమే కాదు, ప్రశంసలు కూడా ఉంటాయి. ప్రశంసించే అవకాశం కూడా వర్ష ఇవ్వడం లేదు.

అలాగని, అన్ని పోస్టులకు కామెంట్స్ ఆప్షన్ తీసేస్తుందా? అంటే అదీ లేదు. కొన్నిటికి కామెంట్ చేసే ఛాన్స్ ఇస్తుంది. తొడలు కనిపించేలా దిగిన హాట్ ఫోటోలకు మాత్రం కామెంట్స్ తీసేస్తుంది. పద్దతిగా చీర కట్టుకున్న కొన్ని ఫోటోలకు, ముఖ్యం మాత్రమే కనిపించేలా దిగిన క్లోజప్ ఫోటోలకు కామెంట్స్ ఆప్షన్ ఉంచింది. దీన్నిబట్టి కావాలనే వర్ష ఇలా చేస్తుందనే సంగతి అర్థమవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.