English | Telugu

మా రిలేష‌న్ షిప్ అంత‌కు మించి అంటున్న జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష‌

బుల్లితెర హాస్య‌ప్రియుల్ని విశేషంగా అల‌రిస్తూ విజ‌య‌వంతంగా సాగుతున్న కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో వ‌ల్ల ఎంతో మంది క‌మెడియ‌న్ లు స్థిర‌ప‌డ్డారు. చాలా మంది పాపుల‌ర్ అయ్యారు కూడా. కొంత మందికి సినిమాలలో న‌టించే అవ‌కాశాన్ని అందించింది. మ‌రి కొంత మందిని హీరోల‌ని చేసింది కూడా. ఈ షోలో జంట‌ల‌కు ఏ స్థాయి ఫాలోయింగ్ వుంటుందో ర‌ష్మీ గౌత‌మ్ - సుడిగాలి సుధీర్ లే ఇందుకు మంచి ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు. వీరి స్థాయిలో కాక‌పోయినా ఓ రేంజ్ లో మ‌రో జంట పాపులారిటీని సొంతం చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది.

అదే వ‌ర్ష - ఇమ్మానుయేల్ జంట. వీరిద్ద‌రి స్క్రీన్ ప్ర‌జెన్స్ ఆక‌ట్టుకుంటోంది. షో లో వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స్కిట్ లు ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్నాయి. దీంతో ఈ ఇద్ద‌రు పాపుల‌ర్ జోడీగా మారిపోయారు. వ‌ర్ష - ఇమ్మానుయేల్ క‌లిసి చేసిన ప్ర‌తీ స్కిట్ సూప‌ర్ హిట్ అనిపించుకుంటూనే వుంది. దీంతో సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ త‌ర‌హాలోనే వీరిద్ద‌రిపై కూడా లింక‌ప్ వార్త‌లు మొద‌ల‌య్యాయి. వ‌ర్ష‌, ఇమ్మానుయేల్ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్నారంటూ వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది.

తాజాగా ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది వ‌ర్ష‌. ఓ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. జ‌బ‌ర్దస్త్ కామెడీ షోలో నేను గ‌త రెండేళ్లుగా వ‌ర్క్ చేస్తున్నాను. ఒక్క స్కిట్ కోసం వ‌చ్చిన నేను ఇమ్మానుయేల్ తో క‌లిసి చేసిన స్కిట్ లో ఒకే ఒక్క డైలాగ్ తో హిట్ అయ్యాను. ఇమ్మూ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్ప‌లేను. మా ఇద్ద‌రి రిలేష‌న్ షిప్ ఏంటి అని నేను చెప్ప‌లేక‌పోతున్నా.

మా ఇద్ద‌రిది ఓ బాండింగ్ అంతే. అది స్కిట్ త‌రువాత కూడా వుంటుంది. భ‌విష్య‌త్తులో నిజ‌మ‌వ్వ‌చ్చు. అది ఇంకా ఏమైనా అవ్వొచ్చు. నేనంటే అత‌నికి చాలా అభిమానం. ఇమ్మూ అంటే నాక్కూడా అంతే. సెట్ లో ఒక్కోసారి నిజంగానే ఎమోష‌న‌ల్ అవుతాం` అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది వ‌ర్ష‌.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.