English | Telugu

ల‌క్కీపై చెయ్యెత్తిన లాస్య‌..తుల‌సి ఉగ్ర‌రూపం

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ ఇంటింటి గృహల‌క్ష్మి. ఒక‌నాటి హీరోయిన్ తుల‌సి ఇందులో టైటిల్ పాత్ర‌ని పోషించారు. గ‌త కొన్ని నెల‌లుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ సితార ఎంట్రీతో కొత్త మ‌లుపు తిరిగింది. త‌ను తుల‌సికి మోర‌ల్ స‌పోర్ట్ గా నిలిచి మొత్తానికి మార్చేసింది. తుల‌సి ముందులా లేదు. పూర్తిగా మారిపోయింది. అయితే అవే ఎమోష‌న్స్‌, అవే ప్రేమ‌లు. క‌ట్టుబొట్టు మాత్రం మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.

మ‌ద‌ర్ థెరిసా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో మాతృదినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతుంటాయి. అక్క‌డికి తుల‌సి వ‌స్తుండ‌టంతో బ‌య‌ట ప్ర‌వ‌ళిక‌, దివ్య త‌న కోసం ఎదురుచూస్తూ వుంటారు. ఈలోగా తుల‌సి రానే వ‌చ్చేస్తుంది. ఆటోలోంచి దిగుతూ వుంటుంది. త‌న‌తో పాటు అత్తా మామ‌లు అన‌సూయ‌, ఆమె బ‌ర్త కూడా వ‌స్తారు. ఇదే వేడుక‌కు లాస్య‌, నందు కూడా వ‌స్తారు. కారు అప్పుడే వ‌చ్చి ఆగుతుంది. తుల‌సి వాళ్లు చూస్తుండ‌గానే లాస్య‌, నందు తో పాటు లాస్య కొడుకు ల‌క్కీ కూడా కారు దిగుతాడు. ద‌గ‌డం దిగ‌డ‌మే తుల‌సిని చూసి `ఆంటీ` అంటూ ప‌రుగుతీస్తాడు. తుల‌సి కూడా అంతే ప్రేమ‌తో ల‌క్కీని ద‌గ్గ‌ర‌కు తీసుకుని ముద్దులు పెడుతుంది.

అది చూసిన లాస్య ర‌గిలిపోతుంది. కొడుకు ల‌క్కీ ని `నిన్ను హాస్ట‌ల్ నుంచి తీసుకొచ్చింది నాతో వుండ‌టానికి అంటుంది కోపంగా. తుల‌సి అంటీ అంటే నాకు ఇష్టం. నీకు ఇష్టం లేక‌పోతే మాట్లాడ‌కు. అంటాడు ల‌క్కీ. దాంతో లాస్య ఈగో దెబ్బ‌తింటుంది. ఏంట్రా పొగ‌రు అంటూ ల‌క్కీపై చెయ్యెత్తుతుంది. అది గ‌మ‌నించిన తుల‌సి ఆగ్ర‌హంతో ఊగిపోతూ.. లాస్య‌పై అరుస్తుంది.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.