English | Telugu

అమ్మ కనిపిస్తే సారీ చెప్తాను.. అమ్మానాన్నల చివరి రోజుల్లో ముద్దుచేయండి!

ఇంద్రజ ఒకప్పటి యంగ్ హీరోయిన్ నుంచి ఇప్పటి జబర్దస్త్ జడ్జ్ వరకు ఆమె ప్రయాణం ప్రతీ ఒక్కరూ చూసారు. అలాంటి ఇంద్రజ వాళ్ళ అమ్మ విషయంలో అనుకున్న పని చేయలేదు అని బాధపడ్డారు. ఆ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. (Indraja)

"వడప్పళని మురుగన్ టెంపుల్ అని ఉంది మా ఇంటికి దగ్గరలోనే. నడిస్తే పది నిమిషాలు. అమ్మ ఎన్నో సార్లు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని అడిగింది. రెండు రోజుల్లో తీసుకెళ్తాను, మూడు రోజుల్లో తీసుకెళ్తాను అంటూ నేను వాయిదా వేసేదాన్ని. ఆమె అడిగిన టు వీక్స్ టైములో అమ్మ హెల్త్ బాగా డామేజ్ అయ్యింది.

నేను చూసినప్పటి నుంచి అమ్మకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండేవి. అలా హాస్పిటల్ కి ఇంటికి తీసుకెళ్లి తీసుకురావడమే సరిపోయేది. ఒక రోజు తెల్లవారుజామున నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. త్వరగా రమ్మని. కాసేపట్లోనే అమ్మ చనిపోయింది. మా అమ్మ ఏది అడిగినా నేను చేసి పెట్టాను. కానీ ఇది మాత్రం తీర్చలేకపోయాను.

ఇప్పటికీ అర్ధరాత్రి మెలకువ వస్తే అదే విషయం నాకు గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీలవుతూ ఉంటాను. ఆ ఫీలింగ్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుసు. చేయాల్సిన పని చేయలేకపోతే చేయాలని ఇప్పుడు అనుకున్నా ఆ మనిషి ఉండనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.

అమ్మ గనక మళ్ళీ నాకు కనిపిస్తే అమ్మా సారీ అని చెప్తాను. గట్టిగా అమ్మను హగ్ చేసుకోవాలనుంది. అమ్మ ఐసీయూలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరినీ లోపలి రానివ్వలేదు. తులసి తీర్థం రెండు స్పూన్ లు ఇవ్వడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోలేదు.

మీ అమ్మానాన్నలు చివరి రోజుల్లోకి వస్తే గనక వాళ్ళను ముద్దు చేయండి. కౌగిలించుకోండి, ముద్దులు పెట్టండి, మంచినీళ్లు తాగించండి, ఏమన్నా తినాలనుకుంటే తినిపించండి.. కూర్చుని రెండు మాటలైనా మాటలాడండి. ఇవన్నీ చేసి వాళ్ళను ప్రశాంతంగా పంపించండి. మన చుట్టూ భర్త, భార్య, పిల్లలు, చుట్టాలు ఉన్నా కూడా అమ్మా నాన్న లేకపోతే మనం అనాధలమే. ఒకవేళ నాకు దేవుడు కనిపిస్తే ఇది కలియుగం కదా ఇలాంటి యుగంలో కూడా మంచి మనుషులు ఉన్నారు కదా వాళ్ళను చల్లగా చూడమని కోరుకుంటాను" అని చెప్పారు ఇంద్రజ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.