English | Telugu

 పెళ్ళి సంబంధం చూడటం వద్దన్న రామరాజు కొడుకు.. కోడలిని కోప్పడిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -83 లో.....అమ్మాయి తండ్రి రామరాజుని అవమానించి పంపిస్తాడు. దాంతో రామరాజు కుటుంబం మొత్తం బాధగా ఇంటికి వస్తుంది. ఏం జరిగిందని ధీరజ్ అడుగుతాడు. వాళ్ళు నాన్నని అవమానించారని ధీరజ్ కీ చందు చెప్తాడు.. దాంతో ధీరజ్ బాధపడతాడు.సాగర్ దగ్గరికి నర్మద వస్తుంది. నువ్వు కావాలనే ఇదంతా చేసావ్ కదా అని సాగర్ అడుగుతాడు.

నేనెందుకు కావాలని చేస్తానని నర్మద అంటుంది. మా నాన్న మన పెళ్లిని ఇంకా ఒప్పుకోలేదని, ఇలా మా నాన్న మాటలు పడేలా చేసావని సాగర్ కోప్పడుతుంటే.. నీకు ఏమైనా బుద్ది ఉందా ఎందుకు ఇలా అంటున్నావని నర్మద అంటుంది. ఏం అన్నావంటూ నర్మద పైకి సాగర్ చెయ్ ఎత్తుతాడు అప్పుడే రామరాజు వచ్చి నీకు బుద్ది ఉందా అమ్మాయిపై అలా చెయ్ ఎత్తుతావా అని సాగర్ పైకి రామరాజు చెయ్ ఎత్తితే నర్మద ఆపుతుంది. తనకి పెళ్లి అయింది చిన్న పిల్లాడు కదా.. మీరు కొడితే బాధపడుతారంటూ నర్మద అనగానే.. ఏంటి మీ మావయ్యకి ఎదురు తిరుగుతావా అని నర్మదపై వేదవతి కోప్పడుతుంది.ఆ తర్వాత రామరాజు దగ్గరికి చందు వెళ్లి.. నా పెళ్లి వల్ల ఇన్ని ఇబ్బందులున్నాయ్.. నాకు పెళ్లి సంబంధం చూడడం మానెయ్ అంటూ బాధపడతాడు. దాంతో రామరాజు ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు ప్రేమ ధీరజ్ లు గొడవపడతారు. మీ వళ్లే.. ఏదో చేశారు అందుకే ఇలా అని ప్రేమతో ధీరజ్ అంటాడు. మా వాళ్ళు అలా ఏం చెయ్యరని ప్రేమ అంటుంది.

నర్మద కోపంగా కిచెన్ లోకి వెళ్లి అరిసెలు తింటుంటే వేదవతి వస్తుంది. నువ్వు కోపంగా వస్తే ఏం చేస్తున్నావనుకున్నా నువ్వు చేసేది ఇదా అని వేదవతి అంటుంది. ప్రేమ ధీరజ్ ల గొడవ విని.. వేదవతి వెళ్లి నచ్చజెప్పుతుంది. ఆ తర్వాత రామరాజు కి ముళ్ళు గుచ్చుకుంటుంది. దాంతో వేదవతి లోపలకి వెళ్లి మందు తీసుకొని వచ్చేలోపు నర్మద రామరాజు కాలు పట్టుకొని ముళ్ళు తీస్తుంటుంది. దాంతో వేదవతి మురిసిపోతుంది. తరువాయి భాగంలో నీ కొడుకు నా మేనకోడలితో పాటు ఏడువారాల నగలు తీసుకొని వెళ్ళాడని చెప్తుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. నువ్వు తీసుకొని వచ్చావా అని అడుగగానే.. కాదని చెప్తే అసలు నిజం బయటకు వస్తుందని తీసుకున్నానని ధీరజ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. వాళ్ళ నగలు వాళ్ళకి ఇవ్వమని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.