English | Telugu

పెళ్ళికూతురు గదిలోకి కళ్యాణ్.. తనని ట్రాప్ చేస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -47 లో..... ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది కానీ తన పెళ్లి విషయం చెప్పలేకపోతుంది. అప్పుడే ధీరజ్ ఫోన్ చేసి ఈ టైమ్ లో కూడా నువ్వు ఆ కళ్యాణ్ తో మాట్లాడమేంటి వాడు ఏదో ఆశించి నిన్ను ట్రాప్ చేసాడు. వాడితో లేచిపోవడం లాంటివి పెట్టుకోకు.. ఎందుకంటే నువ్వు ఒక్క కూతురువి నిన్ను మీ నాన్న చాలా గారాభంగా పెంచాడు. మీ అత్తయ్య కి నువ్వు అంటే ప్రాణం బుద్దిగా పెళ్లి చేసుకోమని ధీరజ్ చెప్తాడు.

ఆ తర్వాత కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రేమ. నాకు పెళ్లి అని చెప్తంది. దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. నువ్వు రా పెళ్లి చేసుకుందామని కళ్యాణ్ అంటాడు. నేను రానని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ప్రేమ ఫోన్ కట్ చేసాక.. నిన్ను ఎలా తీసుకొని రావాలో తెలుసని కళ్యాణ్ అనుకుంటాడు. మరొకవైపు వేదవతి బాధపడుతుంటే.. నువ్వు ఇక్కడ వద్దు.. పెద్దోడి పెళ్లి జరగాలంటే పంతులు పూజ చెయ్యాలన్నాడు. వెళ్లి రెండు రోజులు గుడిలో ఉండి పూజ జరిపించిరా అని రామరాజు అంటాడు. నేను వస్తానని నర్మద అనగానే.. సరే అంటాడు. ఆ తర్వాత రామరాజు బాధపడతాడు. నా వల్ల మీ అమ్మ ఎన్నింటికి దూరం అయిందని ధీరజ్ తో రామరాజు చెప్తూ బాధపడతాడు. అందుకే ఇలా లేచిపోయి చేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుందంటే మీరు వినరని రామరాజు అనగానే మిమ్మల్ని బాధపెట్టే పని చేయనని ధీరజ్ అంటాడు. రామరాజు డబ్బులు ఇస్తూ వాళ్ళతో వెళ్లి పూజ దగ్గరుండి చేయించమని అనగానే.. ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాగ్ చేసుకొని నన్ను నమ్మి డబ్బు ఇస్తున్నారా అంటూ ఎమోషనల్ అవుతూ సరే అంటాడు ధీరజ్.

మరొకవైపు నర్మద దగ్గరికి సాగర్ రాగానే.. ఇలా అత్తయ్యతో ఊరు వెళ్తున్నానని చెప్తుంది. దాంతో సాగర్ డిస్సాపాయింట్ అవుతాడు. ఆ తర్వాత విశ్వ వాళ్లు ధీరజ్ ని చుసి కావాలనే డాన్స్ చేస్తుంటారు. కానీ ధీరజ్ కూడా డాన్స్ చేస్తాడు నువ్వెందుకు చేస్తున్నావని విశ్వ అనగానే.. నేను చాలా హ్యాపీగా ఉన్నానని ధీరజ్ చెప్తాడు. అప్పుడే ధీరజ్ ని పిలుస్తాడు రామరాజు. వేదవతి వాళ్లు బయటకు రావడంతో వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారని భద్రవతి ఆశ్చర్యంగా చూస్తారు. తరువాయి భాగంలో పెళ్లి పనులు జరుగుతుంటాయి. ప్రేమ గదిలోకి కళ్యాణ్ వచ్చి.. పదా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.