English | Telugu
గీత దాటి వచ్చింది.. మీ నాన్న సారీ చెప్పాలి!
Updated : Dec 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -35 లో.. నర్మద దగ్గరికి ప్రేమ వచ్చి.. ధీరజ్ అటువైపు ఉన్నాడు.. వెళ్ళండి అని చెప్తుంది. దాంతో ధీరజ్ దగ్గరికి వెళ్తుంది నర్మద. ప్రేమ నువ్వు ఇక్కడ ఉన్న విషయం చెప్పిందని నార్మద అంటుంది. ఎందుకు వచ్చావ్ వదిన అంటూ ధీరజ్ అడుగుతాడు. మీ అమ్మ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చెయ్యడం లేదు.. పాపం తను ఏడుస్తూ తిండి కూడా తింటలేదు.. పెద్దవాళ్ళేం చేసిన మన కోసమే కదా ఇంటికి రా అని నర్మద అంటుంది.
నేను మీ పెళ్లి చేస్తున్నప్పుడు.. ఏదో చిన్న భయం ఉండేది కానీ నేను చేసింది కరెక్ట్ పని అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. మీరు మా కుటుంబం గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారని ధీరజ్ అంటాడు. మీరు వెళ్ళండి నేను వస్తానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత నర్మద ఇంటికి వెళ్లి ధీరజ్ గురించి చూస్తుంది. మరొకవైపు వేదవతి ఏడుస్తుంటే.. బయటున్న ధీరజ్ లోపలకి వస్తాడు.. వేదవతి దగ్గరికి పంపిస్తుంది నర్మద.
ఆ తర్వాత ధీరజ్ ని చూసి వేదవతి ఎమోషనల్ అవుతుంది. అమ్మ ఆకలి అని ధీరజ్ అనగానే.. వేదవతి తినిపిస్తుంది. వదిన వచ్చి నువ్వు భాదపడుతున్నావని చెప్పి తీసుకొని వచ్చిందని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఎవరో వస్తున్నారంటూ భయపడి దాక్కుంటారు కానీ పెద్దోడు వాళ్లు వస్తారు. ఆ తర్వాత రామరాజు రాగానే ధీరజ్ దక్కుంటాడు. ధీరజ్ నీ అద్దంలో నుండి రామరాజు చూసి.. మళ్ళీ వచ్చావా అంటూ కోప్పడతాడు. దాంతో నేను చెప్పినట్టు చెయ్యండి అని నర్మద అనగానే వేదవతి చేస్తుంది. మీరు వాడిని ఇంట్లో నుండి పంపిస్తే నేను కూడా వెళ్లిపోతానని వేదవతి అనగానే నేనే వెళ్ళిపోతానని రామరాజు వెళ్తుంటాడు. అందరు కలిసి రామరాజుని ఆపుతారు. తరువాయి భాగంలో నర్మద గీత ధాటి వచ్చిందని భద్రవతి కుటుంబం గొడవపడుతుంది. సాగర్ సారీ చెప్తుంటే.. మీ నాన్న చెప్పాలని భద్రవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.