English | Telugu

ఆనందరావుని దొంగ అని కొట్టిన భద్రవతి.. భాగ్యం ఎంట్రీతో తప్పించుకున్నాడుగా!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -233 లో..... దొంగ వచ్చాడని రామరాజు ఇంట్లో అందరు పడుకోకుండా కూర్చొని ఉంటారు. మావయ్య, అత్తయ్య గారికి మాటలు కలపడం ఇదే కరెక్ట్ టైమ్ అని ప్రేమ, నర్మద అనుకుంటారు. అత్తయ్య గారు మీ లవ్ స్టోరీ చెప్పండి అని నర్మద, ప్రేమ అనగానే వేదవతి చిర్రుబుర్రులాడుతుంది.

వాళ్ళ లవ్ స్టోరీకి నేనే మెయిన్ పిల్లర్ అంటూ తిరుపతి ఎంట్రీ ఇస్తాడు. తిరుపతి తన అక్క, బావ లవ్ స్టోరీ చెప్తుంటే ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత మావయ్య గారు అత్తయ్య మీ కోసం తన కుటుంబాన్ని మొత్తం వదిలేసిందని వేదవతికి కోపం పోగొట్టేల నర్మద మాట్లాడుతుంది. మరుసటి రోజు ఉదయం భద్రవతి కుటుంబం మొత్తం ఆనందరావుని తీసుకొని రామరాజు ఇంటికి గొడవకి వస్తారు. నా వియ్యంకుడిని అలా కట్టేసి తీసుకొని వస్తున్నారని రామరాజు వాళ్ళపై కోప్పడతాడు వాడు మా ఇంటికి దొంగతనానికి వచ్చాడని భద్రవతి చెప్పగానే అందరు షాక్ అవుతారు. అదేంటి వాళ్ళు సమాజంలో మంచి పేరు ఉన్నవాళ్ళని రామరాజు అంటాడు. ఎవరి సంగతి అయిన పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే తెలుస్తుందని భద్రవతి అంటుంది. దాంతో శ్రీవల్లి, ఆనందరావు టెన్షన్ పడుతారు.

అప్పుడే భాగ్యం ఎంట్రీ ఇస్తుంది. మా ఆయన వచ్చారా అని అడుగతుంది. అయన ఏంటి అలా ఉన్నాడు.. ఈ రోజు శ్రీవల్లి పుట్టినరోజు అర్ధరాత్రి తన కూతురికి విషెస్ చెప్పాడానికి వచ్చాడని భాగ్యం అంటుంది. అవును కన్ఫ్యూషన్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను.. దాంతో నన్ను దొంగ అంటున్నారని ఆనందరావు అంటాడు. విన్నారు కదా ఇంకొకసారి తప్పుగా అర్థం చేసుకోకండి అని భద్రవతి కుటుంబాన్ని పంపిస్తాడు రామరాజు. కాసేపటికి కుటుంబం అంతా లోపలికి వెళ్తారు. భాగ్యం హమ్మయ్య అని రిలాక్స్ అవుతుంటే నర్మద చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.