English | Telugu
ప్రేమ చేసిన పనికి రామరాజు కుటుంబంపై సేనాపతి దాడి!
Updated : Jul 13, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -209 లో......ధీరజ్ ఇచ్చిన షర్ట్ రామరాజు వేసుకొని బైక్ పై తన ముందు నుండి వెళ్తుంటే ధీరజ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. రామరాజు వెనక్కి వచ్చి ధీరజ్ దగ్గర ఆగుతాడు. వెళ్తుంటే కన్పించావ్.. బండి ఎక్కు అని రామరాజు అంటాడు. అదే సంతోషం అన్నట్టుగా ధీరజ్ బండి ఎక్కుతాడు. హ్యాపీగా ఫీల్ అవుతూ రామరాజుని హగ్ చేసుకుంటాడు.
మరొకవైపు ప్రేమ ఇంటికి వస్తుంది. ఎక్కడ వాళ్ల నాన్న సేనాపతి వచ్చి గొడవ చేస్తాడోనని టెన్షన్ పడుతుంది. అన్నట్లుగానే ధీరజ్, రామరాజు ఇంటికి రాగానే సేనాపతి, భద్రవతి, విశ్వ రామరాజు ఇంటిపైకి గొడవకి వస్తారు. ఆడవాళ్ల కష్టం మీద పడి బ్రతకడానికి సిగ్గు లేదా రామరాజుపై సేనాపతి విరుచుకుపడుతాడు. నా కూతురు పిల్లలకి డాన్స్ క్లాస్ చెప్తుందని సేనాపతి అనగానే అందరు షాక్ అవుతారు. అతను చెప్పేది నిజమేనా అని రామరాజు అనగానే నిజమేనని ప్రేమ అంటుంది. ఎందుకు ఇలా చేసావ్ అమ్మ.. నీకు వద్దని చెప్పాను కదా.. నా మాట అంటే లెక్కలేదా అని ప్రేమతో రామరాజు అంటాడు.
దొరికింది ఛాన్స్ అన్నట్లుగా భద్రవతి కుటుంబం మొత్తం.. రామరాజు కుటుంబంపై విరుచుకుపడతారు. ఇరు కుటుంబాల మధ్య గొడవ ముదురుతుంది. ధీరజ్, విశ్వ ఇద్దరు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.