English | Telugu

Illu illalu pillalu: మేనకోడలి పెళ్ళికి గిఫ్ట్ పంపిన అత్త.. విసిరేసిన భద్రవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -45 లో.... వేదవతి దగ్గరికి నర్మద వచ్చి కూరగాయలు కొనుక్కొని వద్దాం అత్తయ్య అని అడుగుతుంది. మొదట రానని అన్నా కూడా నర్మద తన మాటలతో కన్విన్స్ చేస్తుంది. ఇద్దరు కలిసి కూరగాయలు కొనడానికి వెళ్తారు. మరొక వైపు ప్రేమని ధీరజ్ అటపట్టిస్తాడు. నిన్ను పెళ్లి చేసుకునే వాడు ఎవడో గాని వాడి పని అంతే అని ధీరజ్ అంటాడు. ధీరజ్ ని కొట్టాలని ప్రేమ ఏదో ఒకటి విసిరేస్తుంది. అవి అన్ని కూడా తిరుపతికి తాకుతాయి.

ఆ తర్వాత నర్మద, వేదవతి లు కూరగాయలు కొంటుంటారు. అప్పుడే సేనాపతి, రేవతిలు అటుగా కార్డ్స్ ఇస్తూ వెళ్తు.. నర్మద, వేదవతిలని చూస్తారు. సేనాపతి వేదవతి వంక వెళ్తాడు. తన చెల్లిపై ఎంత కోపమున్నా కార్డ్ ఇవ్వడానికి వెళ్తున్నాడని రేవతి అనుకుంటుంది. వేదవతి కూడా అలాగే అనుకుంటుంది కానీ సేనాపతి వచ్చి కూరగాయలు అమ్మేవాడికి కార్డు ఇస్తాడు సేనాపతి. దాంతో వేదవతి బాధగా అక్కడ నుండి వెళ్తుంది. తన వెనకాలే నర్మద వెళ్తుంది. మరొకవైపు ప్రేమని పెళ్లి కూతురులాగా రెడీ చేస్తారు. తనని చూసి భద్రవతి మురిసిపోతుంది.

ఆ తర్వాత వేదవతి బయట ఉండి ఆ ఇంటి వైపు చూస్తుంటుంది. వేదవతి వాళ్ళ అమ్మ బయటకు వచ్చి బాధపడుతుంటే.. ఎందుకు అమ్మ లోపలికి రా అని భద్రవతి అంటుంది. అసలైన వాళ్లు వస్తేనే సంతోషమని పెద్దావిడ అనగానే అసలైన వాళ్ళు ఎవరని భద్రవతి అంటుంది. మేనత్త అని పెద్దావిడ అంటుంది. దాంతో భద్రవతి తనపై కోప్పడుతుంది. తరువాయి భాగం లో వేదవతి ప్రేమకి గిఫ్ట్ గా నెక్లెస్ తీసుకొని పెద్దావిడకి ఇచ్చి పంపిస్తుంది. అది చూసి భద్రవతి దానిని దూరంలో విసిరేయగా అటుగా వస్తున్న రామరాజుపై పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.