English | Telugu

Illu illalu pillalu : ప్రేమకి సపోర్ట్ గా ధీరజ్.. శ్రీవల్లి, చందు ఒక్కటయ్యారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -267 లో..... ప్రేమ కోసం ధీరజ్ భోజనం తీసుకొని వస్తాడు. తను నాకు వద్దని అంటుంది. ఇన్ని రోజులు ఏమైనా కూడా నాకూ నా ధీరజ్ ఉన్నాడని అనుకున్న కానీ నీ మనసులో నాపై ఎలాంటి ఫీలింగ్ లేదు. నువ్వు నన్ను కళ్యాణ్ గాడు మోసం చేసాడని మాత్రమే పెళ్లి చేసుకున్నావ్ కదా అన్నప్పుడు సైలెంట్ గా ఉన్నావ్.. నాకు ఇంకా బాధేసిందని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. ప్రేమ కోపం తగ్గించాడనికి ధీరజ్ చేతిపై సారీ అని రాసి చూపిస్తాడు అయినా ప్రేమ పట్టించుకోదు.

మరొకవైపు నర్మద కోసం సాగర్ మల్లెపూలు తీసుకొని వస్తాడు. తనే స్వయంగా నర్మద తల్లో పెడతాడు. నా భార్యకి ఇంట్లో బయట ఇంత గౌరవం దక్కుతుందమటే నాకు గర్వంగా ఉందని నర్మదతో సాగర్ అంటాడు. ఆ తర్వాత చందు తనని పట్టించుకోవడం లేదని శ్రీవల్లి ఏడుస్తూ.. బావ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ నువ్వు నన్ను పట్టించుకోవని అంటుంది. లేదు నువ్వంటే నాకు ఇష్టమని శ్రీవల్లిని దగ్గరికి తీసుకుంటాడు చందు. నా భర్త నాకు సపోర్ట్ గా ఉన్నాడు.. ఇప్పుడు ఆ నర్మద ప్రేమ సంగతి చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది.

మరొకవైపు ధీరజ్ ని గుర్తుచేసుకొని ప్రేమ సిగ్గుపడుతు ఉంటుంది. అప్పడే ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. తరువాయి భాగంలో కళ్యాణ్ ఫోన్ చేసిన విషయం ధీరజ్ తో ప్రేమ చెప్తుంది. ఆ కళ్యాణ్ గాడిని ఎలాగైనా పట్టుకొవాలని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు ప్రేమ గదిలోకి శ్రీవల్లి వచ్చి కొరియర్ ఓపెన్ చేసి చూస్తుంది. కళ్యాణ్ ప్రేమ ఉన్న ఫోటోని చూసి షాక్ అవుతుంది. ఇవి మావయ్య గారికి చూపిస్తే అప్పుడు ఉంటుందని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.