English | Telugu
Illu illalu pillalu : సపోర్ట్ లేదని శ్రీవల్లి ఏడపు.. ధీరజ్ ని హగ్ చేసుకున్న ప్రేమ!
Updated : Sep 17, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -265 లో..... ధీరజ్ ఎక్కడికి అని అంటున్నా కూడా ప్రేమ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. మరొకవైపు తిరుపతి, రామరాజు మాట్లాడుకుంటుండగా అప్పుడే నర్మద, వేదవతి వస్తారు. వేదవతి ఆడవాళ్లు గొప్ప.. అది ఇది అంటూ కొటేషన్ చెప్తుంటే.. అసలు విషయం చెప్పమని రామరాజు అంటాడు.
మన నర్మదకి ప్రమోషన్ వచ్చిందని వేదవతి అనగానే అందరు సంతోషపడుతారు. నర్మదని మెచ్చుకుంటుంటే శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. అప్పుడే భాగ్యం, ఆనందరావు వచ్చి నర్మదని మెచ్చుకుంటారు.. కానీ జాగ్రత్త ప్రేమ కుటుంబం వాళ్ళు వచ్చి ప్రేమ తో జాబ్ చేయిస్తున్నారని అన్నయ్య చొక్క పట్టుకున్నట్లు ఇప్పుడు నర్మద వాళ్ళు తనతో ఉద్యోగం చేయిస్తున్నారని ఆలా చెయ్యరు కదా అని భాగ్యం అంటుంటే వదిన ఆ విషయం వదిలేయ్ అని వేదవతి అంటుంది. స్వీట్ పంచండి అని సాగర్ తో రామరాజు అంటాడు.
మరొకవైపు కళ్యాణ్ దగ్గరికి ప్రేమ వెళ్తుంది. తన భుజం పై చెయ్ వేస్తాడు. నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావని కళ్యాణ్ ని ప్రేమ కొడుతుంది. దాంతో కళ్యాణ్ తన చేతులు కట్టేస్తాడు. అప్పుడే ధీరజ్ వచ్చి కళ్యాణ్ ని కొడుతుంటే అతను పారిపోతాడు. ధీరజ్ ని ప్రేమ హగ్ చేసుకొని ఏడుస్తుంది. మరొకవైపు శ్రీవల్లి కోపంగా వచ్చి గదిలో వస్తువులు పగులగొడుతుంది. ఇంట్లో అందరు అంటే మీరు కూడా ఆ నర్మదని పొగుడుతారా.. నాకు ఏ సపోర్ట్ లేదని శ్రీవల్లి అంటుంటే.. తన చేతిలో భాగ్యం పదిలక్షలు పెడుతుంది.. తరువాయి భాగంలో నాకెందుకు కళ్యాణ్ గురించి చెప్పలేదని ప్రేమని ధీరజ్ అడుగుతాడు. నాకెవరు లేరని ప్రేమ ఎమోషనల్ అవుతుంటే నేనున్నానని ధీరజ్ అంటాడు కానీ నీ మనసులో నాకు చోటు లేదు కదా అని ప్రేమ అనగానే ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.