English | Telugu

Illu illalu pillalu : ప్రేమ పెళ్ళి చేసుకున్నాడని ఇంట్లో నుండి గెంటేసిన తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -28 లో.....ధీరజ్ దగ్గరుండి మరీ సాగర్, నర్మదల పెళ్లి జరిపిస్తాడు. ఇక నర్మద మీ ఇంటికి వెళదామనడంతో ధీరజ్ సపోర్ట్ తో ఇంటికి బయలుదేర్తారు. మరొకవైపు రామరాజు పెద్ద కూతురు కామాక్షి వేదవతి దగ్గరికి వస్తుంది. తన కూతురు అక్కడే ఉండి చదువుతుంటుంది. ఇక్కడ తాతయ్య భయంతో చదువుతావని ఇక్కడ ఉంచితే చదవడం లేదని తన కూతురిని కామాక్షి తిడుతుంది.

ఇక కామాక్షి తన చెల్లితో గొడవపడుతుంది. అప్పుడే సాగర్ నర్మదలని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి అందరు షాక్ అవుతారు. అల్లుడు ఎంత పని చేసావ్ రా అని వాళ్ళ మామ అంటాడు. అప్పుడే రామరాజు బయటకు వచ్చి ఏమైందని అంటాడు. నర్మద, సాగర్ లని చూసి షాక్ అవుతాడు. ఎదురింట్ల ఉన్న సేనాపతి, భద్రవతి ఇద్దరు వాళ్ళని చూసి రామరాజు పరువు పోయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. తండ్రి దారినే కొడుకు అంటు రామరాజుకి ఇంకా కోపం వచ్చేలా సేనాపతి మాట్లాడతాడు.

నాన్న నన్ను క్షమించండి అని సాగర్ అనగా... నువ్విలా చేస్తావనుకులేదని రామరాజు బాధపడతాడు. నువ్వు ఇలా ఎలా చేసావ్ రా అందుకేనా వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళావని వేదవతి అంటుంది. మీ నాన్న పరువు తీసావ్ కదరా అని వేదవతి బాధపడుతుంది. తరువాయి భాగంలో ఊళ్ళో వాళ్లు రామరాజు కొడుకు లేచిపోయి.. పెళ్లి చేసుకున్నాడంటూ తప్పుగా మాట్లాడుతుంటే ధీరజ్ వాళ్లపై కోప్పడతాడు. ఆ తర్వాత సాగర్ ని ఇంట్లో నుండి రామరాజు గెంటేస్తాడు. ఆ తర్వాత జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.