English | Telugu
Illu illalu pillalu : శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇచ్చిన నర్మద.. తను ఏం చేయనుంది!
Updated : Aug 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -226 లో......నన్ను మీ వాళ్ళు ఇంత మోసం చేస్తారా మీ ఇంటికి వెళదాం పదా అని శ్రీవల్లిని లాక్కొని బయటకు వెళ్తాడు చందు. ఎదరుగా నర్మద ఉంటుంది. ఏమైంది బావగారు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు. నువ్వెందుకు బావ గారిని రిక్వెస్ట్ చేస్తున్నావని నర్మద అడుగుతుంది. ఇది మా భార్యాభర్తలకి సంబంధించిన విషయం నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నావని శ్రీవల్లి అంటుంది.
కుటుంబంలో ఎవరు బాధపడ్డ అందరి రెస్పాన్సిబిలిటీ అని నర్మద అంటుంది. దాంతో చందుని శ్రీవల్లి పక్కకు తీసుకొని వెళ్లి.. ఈ ఒక్కసారి ఆగండి. ఇప్పుడు మా ఇంటికి వెళ్తే నర్మదకి డౌట్ వస్తుందని శ్రీవల్లి రిక్వెస్ట్ చెయ్యడంతో చందు లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత నువ్వు మా విషయం గురించి ఎందుకు పట్టించుకుంటున్నావని నర్మదపై కోప్పడుతుంది శ్రీవల్లి. ఇది వార్నింగ్ అనుకో ఎమన్నా అనుకో ఇంకొకసారి మా మధ్య ఇన్వాల్వ్ అవ్వకని శ్రీవల్లి అంటుంది. ఇక నేను అసలు వదిలి పెట్టను.. అసలు ఏం జరుగుతుంది మొత్తం తెలుసుకుంటాను.. మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో కనుక్కుంటా. ఇక క్షణం క్షణం భయపడుతూ ఉంటావని శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇస్తుంది నర్మద.
మరొకవైపు ధీరజ్ ఒకసారి నువ్వు ఒక వస్తవు అన్నందుకు ప్రతీసారి నేనొక వస్తువుని నాది నీకు బాధ్యత మాత్రమే అంటూ ప్రేమ టార్చర్ పెడుతుంది. ఆ తర్వాత ఎలాగైనా ఇప్పడు మనం చేసే పనికి శ్రీవల్లి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. తిరిగి వెళ్తుంటే మనం ఫాలో అవుదామని నర్మద, ప్రేమ అనుకుంటారు. నర్మద, ప్రేమ కాజు ఉప్మా ప్లేట్ చేతిలో పట్టుకుంటారు. ఏంటి మీ పుట్టింట్లో చేసుకున్నట్లు ఇష్టం వచ్చింది తింటున్నారని వాళ్ళ చేతిలోది లాక్కొని శ్రీవల్లి తింటుంది. అయ్యో పాపం వల్లి అక్క అందులో బొద్దింకా పడిందని ప్రేమ, నర్మద అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.