English | Telugu

Illu illalu Pillalu: భార్య ఒడిలో వాలిపోయిన భర్త.. ఎగ్జామ్ హాల్లో దొరికిపోయాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-192లో.. ఎగ్జామ్స్ ఉండటంతో ప్రేమ చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి పడకేస్తుంటాడు. రేయ్ సచ్చినోడా.. ఎగ్జామ్ ఉంది కదా చదవకుండా పడుకుంటావ్ ఏంట్రా.. ఫస్ట్ బుక్ తీసి చదువమని ప్రేమ అంటుంది. అబ్బా ఉదయం నుంచి సైకిల్‌పై ఆర్డర్స్ ఇచ్చి అలసిపోయాను.. నిద్ర తన్నుకొస్తుంది. నావల్ల కాదు.. నేను పడుకుంటానని ధీరజ్ పడుకుంటాడు.

చదవమంటే పడుకుంటావ్ ఏంట్రా దొంగ సచ్చినోడా అంటూ దుప్పటి లాగేసి కొడుతుంది. పుస్తకం తెచ్చి ధీరజ్ చేతిలో పెట్టి.. పక్కనే కూర్చోబెట్టుకుని బలవంతంగా చదివిస్తుంది. ఏయ్.. ఏంటే.. మా బాబు కంటే ఎక్కువైపోయావని ధీరజ్ అనగానే.. నోరు మూసుకుని చదవరా అని ప్రేమ భయపెట్టేస్తుంది. ఈ సబ్జెక్ట్ ఏంటే అంత కష్టంగా ఉంది.. అస్సలు అర్థం కావడం లేదు.. ఎక్కడం లేదని అంటాడు ధీరజ్. చూస్తే అలాగే ఉంటుందిరా.. అర్థం చేసుకుని చదివితే ఈజీగా అర్థం అయిపోయింది.. నీనైనా ఆ సబ్జెక్ట్ అయినా అని ప్రేమ అంటుంది. అబ్బో అని ధీరజ్ అంటాడు. అవును ధీరజ్.. భయంతోనో.. అపార్థంతోనో కాకుండా ప్రేమగా చదువు.. అప్పుడు సబ్జెక్ట్ మీద ఎంత అభిప్రాయం, ఇష్టం ఏర్పడతాయో నీకే అర్థం అవుతుందని అంటుంది ప్రేమ. నిన్ను ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని ధీరజ్ అంటాడు. నోరు మూసుకుని తెల్రార్లూ చదవరా.. రేపు ఖచ్చితంగా ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు వస్తాయని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ చదువుతూ ఉంటాడు కానీ నిద్రలోకి జారిపోతుంటాడు. దాంతో జుట్టు పట్టుకుని లాగిపారేసి బలవంతంగా చదివిస్తుంది ప్రేమ. ఇక చదివీ.. చదివీ.. అలా ప్రేమ భుజంపై వాలిపోతాడు. వీడు చెప్పింది నిజమే.. ఫుడ్ డెలివరీ చేసి చాలా అలసిపోయాడు. నిద్ర ఆపుకోలేకపోతున్నాడంటూ ధీరజ్‌ని చూస్తూ అలా ఊహల్లో తేలిపోతుంది ప్రేమ.‌ కాసేపటికి అలా భుజంపై నుంచి ఒడిలోకి జారిపోతాడు ధీరజ్. ఇక తనని ఒడిలో పడుకోబెట్టుకుని జోకొడుతుంది. మరి ఇలా ఒడిలో పడుకుంటే.. ఎగ్జామ్ ఎలా రాస్తాడూ అనే కదా.. ఎగ్జామ్ హాల్‌లో దానికి ఓ చిట్కా చెప్పింది ప్రేమ.


మరోవైపు సాగర్ కి అర్థరాత్రి మెలుకవ వస్తుంది. పక్కన నర్మద లేకపోయేసరికి బయటకొచ్చి చూస్తాడు. అక్కడ నర్మద ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. తన దగ్గరికి సాగర్ వచ్చి ఏమైందని అడుగగా.. రేపు మా నాన్న బర్త్ డే.. నా జాబ్ వచ్చాక వచ్చిన ఫస్ట్ బర్త్ డే.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నా కానీ విషెస్ కూడా చెప్పలేకపోతున్నానని నర్మద అంటుంది. అదేం ప్రాబ్లమ్ కాదు..‌మనం రేపు మీ ఇంటికి వెళ్దాం.. మీ నాన్నకి విషెస్ చెప్దామని సాగర్ అంటాడు. దాంతో నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పటికే నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా అని నర్మద అనగానే..‌ నేనున్నాను కదా బంగారం నేను‌ చూసుకుంటానంటాడు సాగర్. తరువాయి భాగంలో ధీరజ్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్‌కి అడ్డంగా దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.