English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లిపై మండిపడ్డ ఇద్దరు.. రామరాజుతో ధీరజ్ మాట్లాడతాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -190 లో..... రామరాజు చెప్పినట్టు ధీరజ్ వినట్లేదని అతడిని రామరాజు కొడుతాడు. ఎందుకు బావ వాడిని అందరిముందు కొట్టావ్.. వాడికి నచ్చిన పని చెయ్యాలనుకుంటున్నాడు.. అందులో తప్పేముందని తిరుపతి అంటాడు. తండ్రిగా వాడు కష్టపడకూడదనుకుంటున్నాను అంతే అని రామరాజు అంటాడు. కానీ నువ్వు అలా కొట్టడం వల్ల మిగతా కోడళ్ళు వాడికి విలువ ఇస్తారా.. అంతెందుకు ప్రేమ వాడికి విలువ ఇస్తుందా అని తిరుపతి అడుగుతాడు.

మరొకవైపు వేదవతి, ప్రేమ డల్ గా ఉంటారు. అప్పుడే శ్రీవల్లి వచ్చి.. మామయ్య గారు చెప్పినట్టు ధీరజ్ వినట్లేదని తన గురించి వేదవతికి నెగెటివ్ గా చెప్పాలని చూస్తుంది. ఇక ప్రేమ, నర్మద మాత్రం శ్రీవల్లిపై కోప్పడతారు. ఎందుకు ప్రతీ దాట్లో పానకంలో పుడకలాగా దూరతావ్ అనగానే.. నన్ను అంత మాట అంటావా అని శ్రీవల్లి ఏడవటం మొదలెడుతుంది. మరొకవైపు ధీరజ్ బాధపడుతుంటే.. చందు, సాగర్ తన దగ్గరికి వెళ్లి మాట్లాడతారు.

ముగ్గురు కలిసి సరదాగా బయటకు వెళ్లి టీ తాగుతారు. ఆ తర్వాత వేదవతి, ప్రేమ, నర్మద ముగ్గురు కలిసి రామరాజు, ధీరజ్ లు మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తారు. రామరాజు భోజనానికి వస్తాడు. మరొకవైపు ఇప్పుడే భోజనానికి వద్దు.. తర్వాత వెళ్ళు అని ధీరజ్ ని ఆపుతుంది ప్రేమ. రామరాజు భోజనం చేస్తుంటే ధీరజ్ ని వెళ్ళమంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.