English | Telugu

Illu Illalu Pillalu : పోలీస్ స్టేషన్ లో చందు.. విశ్వ కేసు వాపస్ తీసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -113 లో.. రామరాజు దగ్గరికి తిరుపతి వచ్చి చందుని పోలీసులు అరెస్ట్ చేసారని చెప్పగానే రామరాజు వెంటనే స్టేషన్ కి వెళ్తాడు. ఎందుకు అరెస్ట్ చేసారని అక్కడ సీఐని రామరాజు అడుగుతాడు. మీ అబ్బాయి విశ్వ అనే అతన్ని కొట్టాడని కేసు పెట్టారని సీఐ చెప్తాడు.

మరొకవైపు ఆ రామరాజుతో ఏం మాట్లాడినా మనం అనుకున్నది మాత్రం అయ్యేలా లేదని ఇంట్లో వాళ్ళతో భాగ్యం అంటుంది. అప్పుడే భద్రవతి ఫోన్ చేస్తుంది. వాళ్ళ గురించి చెప్పినా వినకుండా సంబంధం ఖాయం చేసుకున్నారు కదా.. మీకు కాబోయే అల్లుడు స్టేషన్ లో ఉన్నాడని భద్రవతి చెప్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది.. అక్కడికి వెళ్ళాక మీరేం మాట్లాడకండి అని తన కూతురు శ్రీవల్లి ఇంకా తన భర్తకి భాగ్యం చెప్తుంది.

ఆ తర్వాత రామరాజు తరపున లాయర్ స్టేషన్ కి వస్తాడు కానీ అది అటెంప్టివ్ మర్డర్ కేసు కాబట్టి బెయిల్ ఉండదని చెప్పడంతో అందరు బాధపడుతారు. భాగ్యం స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. మీరేదో మంచివారు అనుకొని సంబంధం ఖాయం చేసుకున్నాం కానీ ఇలాంటి వాళ్ళని తెలియదు.. మీ ఇంటికి నా కూతురిని ఇచ్చి దాని గొంతు కొయ్యలేనని భాగ్యం చెప్పి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత స్టేషన్ దగ్గర తిరుపతి, ధీరజ్, సాగర్ ఉంటారు. సాగర్ మీద పడి ధీరజ్ ఏడుస్తుంటాడు. ధీరజ్ ఇంటికి వెళ్ళాక నీ వల్లే వాడికి ఈ పరిస్థితి వచ్చిందంటూ ధీరజ్ ని రామరాజు కొడుతాడు. ధీరజ్ ఎంత చెప్పినా వినకుండా తనని అసహ్యహించుకుంటాడు రామరాజు.

తరువాయి భాగంలో విశ్వపై ప్రేమ కేసు పెడుతుంది. ఇంతటితో ఈ గొడవ సర్దుమనగాలంటే నువ్వు చందుపై పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలని విశ్వకి సీఐ చెప్తాడు.. అందుకు విశ్వ ఒప్పుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.