English | Telugu

Illu illalu pillalu : సివంగిలా రెచ్చిపోయిన ప్రేమ.. శ్రీవల్లికి వార్నింగ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -283 లో..... భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి హార్ట్ ఎటాక్ డ్రామా ఆడి రామరాజు ఇంటి నుండి బయల్దేరతారు. తప్పించుకున్నామని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నర్మద ఎదురుపడుతుంది. తనని చూసి ఇద్దరు షాక్ అవుతారు. మీరు యాక్టింగ్ చేస్తున్నారని నాకు తెలుసు.. అసలు ప్రేమ ఫోటోస్ గురించి తన పుట్టింట్లో ఎందుకు చెప్పారని వాళ్ళని నర్మద నిలదీస్తుంది. ఏదో మాట వరుసకి చెప్పామని భాగ్యం అంటుంది.

నాకు మీరు మాట వరుసకి చెప్పినట్టు అనిపించడం లేదు.. ఒకవేళ ఇందులో ఏదైనా రహస్యం ఉందని తెలిస్తే.. మీ సంగతి చెప్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు ఒకవేళ మేమే ఫోటోస్ గురించి వాళ్ళింట్లో చెప్పామని ప్రేమకి తెలిస్తే పరిస్థితి ఏంటని శ్రీవల్లి భయపడుతుంది. దాంతో ప్రేమ దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. ఏదో మాట వరుసకి నేను మా అమ్మకి చెప్పాను.. మా అమ్మ మీ వాళ్ళతో అందని శ్రీవల్లి కూల్ గా చెప్తుంది. దాంతో ప్రేమ సివంగిలాగా తన పైకి కోపంతో లేస్తుంది. మీ బండారం ఇప్పుడే బయటపెడతానని ప్రేమ వెళ్తుంటే.. నర్మద వచ్చి ఆపుతుంది ఇద్దరు కలిసి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తారు. నాకు వార్నింగ్ ఇస్తారా.. మీ సంగతి చెప్తానని శ్రీవల్లి అనుకుటుంది.

మరొకవైపు బతుకమ్మ చేయడానికి కావల్సిన పువ్వుల కోసం అన్నదమ్ములు వెళ్తారు. ఆ తర్వాత అసలు రాత్రి ధీరజ్ నాకు ముద్దు పెట్టాడా లేదా అని ప్రేమ ఆలోచిస్తుంది‌. నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. ప్రేమ బ్యాచిలర్ పార్టీలో జరిగింది మొత్తం చెప్తుంది. అసలు ధీరజ్ నాకు ముద్దు పెట్టాడో లేదో తెలియదు.. మరి నువ్వు చూడలేదా అని నర్మద అడుగుతుంది. లైట్ గా డ్రింక్ చేసానని ప్రేమ చెప్తుంది. అక్క నువ్వే ధీరజ్ ని కనుక్కో ప్లీజ్ నేను దేనిపై కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతున్నానని ప్రేమ అంటుంది. అప్పుడే ధీరజ్ వస్తాడు. అడుగు అక్కా అని నర్మదకి చెప్పి ప్రేమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధీరజ్ మొన్న బ్యాచిలర్ పార్టీలో ఏదో అయిందట అని నర్మద అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.