English | Telugu

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో  సూపర్ ట్విస్ట్.. షాక్ లో రెండు కుటుంబాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -27 లో..... వేదవతి సామూహిక వివాహం జరిగే దగ్గర ఉంటుంది. వాళ్ళని చూస్తే తమ కొడుకులు గుర్తుకువచ్చి సాగర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నాకు మీరే గుర్తు వచ్చారని అనగానే సాగర్ బాధపడుతాడు. ఆ తర్వాత నర్మద మెడలో సాగర్ తాళి కడతాడు.

మరొకవైపు సామూహిక వివాహాలు చేసుకున్న వాళ్లు రామరాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. మనం కూడా అత్తయ్య, మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని నర్మద అనగానే సాగర్ వద్దని అంటాడు. ధీరజ్ ఒక సలహా ఇవ్వడంతో ఆశీర్వాదం కోసం వెళ్తున్న వారి వెనకాలే ఇద్దరు వెళ్లి రామారాజు వేదవతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత చెంచలమ్మతో మాట్లాడి రామరాజు వేదవతిలు అక్కడ నుండి వెళ్లిపోతారు. మరొకవైపు నర్మద, సాగర్ లు వెళ్తుంటే.. మీరెవరు ప్రేమ వివాహం చేసుకున్నారా అని చెంచలమ్మ అడుగుతుంది. పెద్దలని ఒప్పించి చేసుకోవాలి.. వెళ్లి పెద్దలను క్షేమించమని అడిగండి అని చెంచలమ్మ చెప్పగానే.. సరే అని చెంచలమ్మ దగ్గర సాగర్ నర్మదలు ఆశీర్వాదం తీసుకుంటారు.

ఆ తర్వాత ఇప్పుడు మనం వైజాగ్ వెళదామని సాగర్ అంటాడు. వద్దు మనం మీ ఇంటికి వెళదాం.. చెంచలమ్మ గారు చెప్పింది మర్చిపోయావా అని నర్మద అంటుంది. వద్దని సాగర్ అంటుంటే అప్పుడే ధీరజ్ వచ్చి.. తను చెప్పింది కరెక్ట్ ఇంటికి వెళ్ళాలని అంటాడు. తరువాయి భాగంలో నర్మద, సాగర్ లని తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసి భద్రవతి కుటుంబం ఓవైపు.. రామరాజు కుటుంబం మరోవైపు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.